బాయ్  ఫ్రెండ్ కి ఉన్న తాగుడు అలవాటు కారణంగా ఆమె తన ఉద్యోగాన్నే కోల్పోవాల్సి వచ్చింది. కేవలం అతను మద్యం తాగి విమానం ఎక్కి చేసిన రచ్చ కారణంగా... అతను ఆమె బాయ్ ఫ్రెండ్ అనే కారణంతో ఉద్యోగం లో నుంచి తొలగించారు. ఈ సంఘటన సింగపూర్ హోటల్ లో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... నటాలీ అనే యువతి బ్రిటీష్ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తోంది. కాగా... ఇటీవల విమానంలోకి తనతోపాటు తన బాయ్ ఫ్రెండ్ ని కూడా తీసుకువచ్చింది. అయితే...  హోటల్‌లోని రిసెప్షన్‌ ప్రాంతంలో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ పైలట్‌తో ఎయిర్‌హోస్టెస్‌ నటాలీ ఫ్లిండాల్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఘర్షణ పడ్డాడు. దీంతో ఆ పైలెట్ సంబంధిత అధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. 

నటాలీ తన బాయ్‌ఫ్రెండ్‌ను వెనుకసీటులో కూర్చుండబెట్టగా...అతను మద్యం సేవించి... ఆ మత్తులో అతను సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ ఎయిర్‌హోస్టెస్‌ నటాషాను సస్పెండ్‌ చేసింది. తమ సిబ్బంది నుంచి సరైన ప్రవర్తనను ఆశిస్తామని, క్రమశిక్షణను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు చేపడతామని ఎయిర్‌వేస్‌ ప్రతినిధి స్పష్టం చేశారు. దీనిపై ఆమె వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా... ఎయిర్ లైన్స్ వినిపించుకోకపోవడం గమనార్హం.