అతను ఎనిమిది అడుగుల అందగాడు. ఆప్ఘాన్ క్రికెటర్లకు అతను వీరాభిమాని. ప్రస్తుతం లక్నోలో పర్యటిస్తున్న అతనిని చూసేందుకు జనాలు ఎగపడి చూస్తున్నారు. సాధారణంగా వెస్టిండీస్, ఆఫ్ఢనిస్తాన్ క్రికెటర్లు బస చేసిన హోటళ్లపై జనాలు కన్నెత్తి కూడా చూడరు. కానీ... ఇతని ఎత్తుకి ఇంప్రెస్ అయిపోయిన జనాలు.. అతనిని చూడటానికి ఎగపడటం విశేషం. అతని పేరు షేర్‌ ఖాన్‌

విచిత్రమేమిటంటే... ఇప్పుడు అతనికి లక్నోలో హోటల్ దొరకడం కూడా ఇబ్బందిగా మారింది. ఇప్పటి వరకు ఆయన చాలా హోటళ్లకు రూమ్ కోసం వెళ్లినా... ఒక్కరు కూడా ఆయనకు రూమ్ ఇవ్వడానికి ఒప్పుకోకపోవడం గమనార్హం. అందుకు కారణం కూడా ఆయన ఎత్తే. అంత ఎత్తు ఉన్న వ్యక్తికి ఎకామిడేషన్ ఇవ్వలేమని హోటల్ యజమానులు చెబుతుండటం విశేషం.

ఎత్తు ఎక్కువ కారణంగా... గదిలోకి ఎంటర్ అయ్యేటప్ప నుంచి పడుకోవడానికి బెడ్ దాకా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే హోటల్ వాళ్లు ఇవ్వడం లేదు. దీంతో.. విసిగి వేసారిపోయిన షేర్ ఖాన్.... పోలీసుల సాయం కోరగా వారు హోటల్‌ రాజధానిలో రూం ఇప్పించారు. కాబూల్‌కు చెందిన అత్యంత పొడగరి ఖాన్‌ను చూసేందుకు హోటల్‌ వెలుపల వందలాది మంది గుమికూడారు. 

పొడగరిని చూసేందుకు దాదాపు 200 మందికి పైగా వచ్చారని, దీంతో షేర్‌ ఖాన్‌ డిస్ట్రబ్‌ అయ్యారని హోటల్‌ యజమాని రణు చెప్పారు. హోటల్‌ వెలుపల జనం పెద్దసంఖ్యలో గుమికూడటంతో ఆప్ఘన్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ కోసం ఆయనను పోలీసులు ఎస్కార్ట్‌గా నిలిచి స్టేడియంకు తీసుకువెళ్లారు. మరో నాలుగైదు రోజులు షేర్‌ ఖాన్‌ నగరంలో​ ఉంటారని హోటల్‌ యజమాని తెలిపారు