టీకాలే కాదు బూస్టర్ కూడా మస్ట్.. అవి తీసుకుంటేనే యూఏఈలోకి అనుమతి..

కేవలం విదేశాలకు వెళ్లేవారికి వీసా ఉంటేనే నెల రోజుల వ్యవధిలో రెండు డోసుల టీకాలను ఇస్తున్నారు. ఇప్పుడు బూస్టర్ డోస్ అంశాన్ని యూఏఈ తెరమీదికి తేవడంతో యూఏఈ వెళ్లే వలస కార్మికులు అయోమయానికి గురవుతున్నారు. వీసా గడువు సమీపించే వారికి కేంద్రం బూస్టర్ డోస్ ఇవ్వాలని కోరుతున్నారు. 

UAE permission only for those who have taken the booster, Imposed new regulations

బాల్కొండ : కరోనా, Omicron variant విస్తరిస్తున్న నేపథ్యంలో తమ దేశానికి వచ్చే విదేశీయులకుUnited Arab Emirates (యూఏఈ) కొత్త నింబధనలను విధించింది. టీకా రెండు డోసులు తీసుకున్న వారు Booster dose తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన ఈ నెల 10 నుంచి అమలులోకి రానుంది. 

సాధారణంగా ఎక్కడైనా రెండు డోసుల టీకాలనే ఇస్తున్నారు. మనదేశంలో బూస్టర్ డోసు కేవలం Front Line Warriors కే ఇవ్వాలని నిర్ణయించారు. ఇతరులకు బూస్టర్ డోస్ ఇచ్చే అంశం ఇంకా వైద్య ఆరోగ్య శాఖ పరిశీలనలో ఉంది. దేశంలో కోవిషీల్డ్ టీకా ఎక్కువగా ఇస్తుండగా మొదటి డోస్ కు, రెండో డోస్ కు 84 రోజుల కాలపరిమితి విధానాన్ని అమలు చేస్తున్నారు. 

కేవలం విదేశాలకు వెళ్లేవారికి వీసా ఉంటేనే నెల రోజుల వ్యవధిలో రెండు డోసుల టీకాలను ఇస్తున్నారు. ఇప్పుడు బూస్టర్ డోస్ అంశాన్ని యూఏఈ తెరమీదికి తేవడంతో యూఏఈ వెళ్లే వలస కార్మికులు అయోమయానికి గురవుతున్నారు. వీసా గడువు సమీపించే వారికి కేంద్రం బూస్టర్ డోస్ ఇవ్వాలని కోరుతున్నారు. 

డోసుల మీద డోసులు.. 
దేశంలో 2 డోసుల టీకా కార్యక్రమం ఇంకా సాగుతుండగా యూఏఈలో వలస కార్మికులకు డోసుల మీద డోసుల టీకాలు వేస్తున్నారు. కరోనా మొదటి వేవ్, రెండో వేవ్ లను దృష్ట్యా చైనా ఉత్పత్తి చేసిన సినోఫాం టీకా రెండు, మూడు డోసులు ఇచ్చారు. సినోఫాం టీకాతో వైరస్ కట్టడి కావడం లేదని తాజాగా ఆ టీకీలు మూడు డోసులు తీసుకున్నవారికి మళ్లీ ఫైజర్ టీకా ఇస్తున్నారు. ఇలా ఒక్కొక్కరికీ 3,4 డోసులకు మించి టీకాలు ఇస్తున్నారు. 

WHO Omicron: ఒమిక్రాన్ విశ్వ‌రూపం.. ఒక్కో దేశంలో ఒక్కోలా !

ఇదిలా ఉండగా,  ఒమిక్రాన్.. ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వేరియంట్ డెల్టా కన్నా వేగంగా వ్యాపిస్తూ.. ప్ర‌పంచ‌దేశాల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తోంది. తాజా ఓమిక్రాన్ వేరియంట్ గురించి.. ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ప్ర‌పంచ‌దేశాల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తున్న‌.. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర‌త ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని సంచ‌నల విష‌యాల‌ను వెల్ల‌డించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) నిపుణులు డాక్టర్ అబ్దీ మహముద్​.  

దక్షిణాఫ్రికాలో  ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య, మ‌ర‌ణాల రేటు కూడా చాలా త‌క్కువ‌గా ఉంద‌ని డాక్టర్ అబ్దీ మహముద్​ పేర్కొన్నారు. అయితే.. ఇతర దేశాలలో ఈ వేరియంట్ ఇలానే ఉంటుంద‌ని చెప్ప‌లేమ‌ని మాత్రం చెప్ప‌లేమని, ఒమిక్రాన్ స్వభావం,​ తీవ్రత ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని చెప్పారు. 

U.N. హెల్త్ ఏజెన్సీకి చెందిన COVID-19 ఇన్సిడెంట్ మేనేజర్ డాక్టర్. అబ్ది మహముద్ మాట్లాడుతూ..  తాజా గణన ప్రకారం.. దక్షిణాఫ్రికాలో తొలి సారి వెలుగులో వ‌చ్చిన  కొత్త వేరియంట్ కేసులను 128 దేశాలు ధృవీకరించబ‌డ్డాయని తెలిపారు.  దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్​తో ఆస్పత్రిపాలయ్యే వారి సంఖ్య గానీ, ఒమిక్రాన్ మరణాలు అత్యల్పంగా ఉన్నాయి. ఇదే తరహాలో ఇతర దేశాల్లో ఉండకపోవచ్చు" అని మహముద్​ పేర్కొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios