అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మరణించారు. నార్త్ కరోలినాలో పనిచేస్తున్న శివ చలపతిరాజు గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తి. రాజమహేంద్రవరంలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన ఉపాధి నిమిత్తం అమెరికాలో స్థిరపడ్డారు.

నార్త్ కరోలినాలోని పలు కంపెనీల్లో పనిచేశారు. ఈ క్రమంలో ఆయన మంగళవారం మరణించినట్లుగా తెలుస్తోంది. అయితే రాజు ఏ కారణం వల్ల చనిపోయారన్నది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం ఆయన భార్య సౌజన్య నిండు గర్భవతి.

Also Read:అమెరికాలో... తెలుగు మాట్లాడే వారు ఇంత మందా!

గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్ లిస్ట్‌లో ఉన్న అతని మరణంతో ఆమె అర్థాంతరంగా భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. శివ చలపతిరాజు మరణం పట్ల అమెరికాలోని తెలుగు సంఘాలు విచారం వ్యక్తం చేశాయి.

ఆయన మృతదేహాన్ని స్వదేశం తరలించేందుకు కావాల్సిన మొత్తాన్ని సమకూర్చేందుకు పీడిమాంట్ ఏరియా తెలుగు అసోసియేషన్ ‘‘గోఫండ్ మీ’’ పేరిట ద్వారా విరాళాలు సేకరిస్తోంది. 

అగ్రరాజ్యం అయిన అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య  ప్రతి ఏటా పెరుగుతూ ఉంది. కిందటి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది కూడా గణనీయంగా పెరిగింది. అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

గత ఎనిమిదేళ్లలో చూసుకుంటే  తెలుగు మాట్లాడేవారి శాతం పెరిగినట్లు యూఎస్‌ సెన్సస్‌ బ్యూరో ఇటీవల విడుదల చేసిన అమెరికన్‌ కమ్యూనిటీ సర్వే రిపోర్టు  2018 పేర్కొంది. ఈ రిపోర్టు ప్రకారం గత 8 ఏళ్లలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఏకంగా 79.5 శాతం పెరిగిందిఅని పేర్కొంది.

Also Read:సౌదీలో తెలుగు ఎన్నారై దారుణ హత్య: ఆలస్యంగా వెలుగులోకి

2010లో 2.23లక్షల మంది తెలుగు మాట్లాడేవారు ఉంటే 2018లో ఈ సంఖ్య 4 లక్షలకు చేరింది. దీంతో అమెరికాలో అత్యధిక మంది మాట్లాడుతున్న భారతీయ భాషల్లో తెలుగు మూడోస్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే, 2017తో పోలిస్తే ఈ సంఖ్య స్వల్పంగా తగ్గింది.

2017లో తెలుగు మాట్లాడేవారు 4.17 లక్షలు ఉండగా, గతేడాదిలో అది 3.7 శాతం తగ్గి 4లక్షలకు చేరింది.ఇక 8.74 లక్షలతో హిందీ అగ్రస్థానంలో ఉంటే, గుజరాతీ రెండోస్థానంలో ఉంది. 2018, జూలై 1 నాటికి యూఎస్‌లో మొత్తం 8.74 లక్షల మంది హిందీ మాట్లాడుతున్నట్లు ఈ సర్వే రిపోర్టు తేల్చింది.

2010తో పోలిస్తే 2018 నాటికి హిందీ మాట్లాడే వారి సంఖ్య 43.5 శాతం పెరిగింది. అమెరికాలో 67.3 మిలియన్ల మంది తమ ఇళ్లలో ఆంగ్లం కాకుండా ఇతర భాషల్లో మాట్లాడుతున్నారని కూడా ఈ  సర్వే పేర్కొంది. ఈ ఎనిమిదేళ్లలో బెంగాలీ మాట్లాడే వారి సంఖ్య 68 శాతం, తమిళం మాట్లాడే వారి సంఖ్య 67.5 శాతం పెరిగినట్లు తాజాగా విడుదలైన సర్వేలో వెల్లడైంది.