అమెరికాలో దుండగుడి కాల్పుల్లో తెనాలి వాసి మృతి.. కొద్ది నెలల్లోనే పెళ్లి అనుకునేలోపు..

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 7, Sep 2018, 11:03 AM IST
telugu NRI died in shooting at cincinnati
Highlights

అమెరికాలోని సిన్సినాటిలో దుండగుడి కాల్పుల్లో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అతన్ని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కందేపి పృథ్వీరాజ్‌గా గుర్తించారు.

అమెరికాలోని సిన్సినాటిలో దుండగుడి కాల్పుల్లో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అతన్ని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కందేపి పృథ్వీరాజ్‌గా గుర్తించారు. ఆరేళ్ల  క్రితం అమెరికాకు వెళ్లిన పృథ్వీ.. చదువు పూర్తిచేసుకుని సిన్సినాటిలోని ఓ బ్యాంకులో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం బ్యాంకులో విధులు ముగించుకుని.. ఉద్యోగులంతా ఇళ్లకు వెళ్లేందుకు బయటకు వస్తుండగా ఆకస్మాత్తుగా వచ్చిన దోపిడి దొంగలు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పృథ్వీరాజ్‌తో పాటు మరో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.

అతని మరణవార్త విన్న కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అతని తండ్రి ఏపీ హౌసింగ్ కార్పోరేషన్‌లో డిప్యూటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కొడుకు అమెరికాలో స్థిరపడటంతో త్వరలోనే వివాహం చేయాలని తల్లిదండ్రులు సంబంధాలు వెతికే పనిలో బిజిగా ఉన్నారు. ఇంతలోనే కొడుకు మరణించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పృథ్వీరాజ్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు అమెరికాలోని తెలుగు సంఘాలు ప్రయత్నిస్తున్నాయి.

అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి.. మృతుల్లో తెనాలి వాసి
 

loader