అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. సిన్సినాటిలోని ఓ బ్యాంకులోకి చొరబడిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు. మృతుల్లో ఒక ప్రవాసాంధ్రుడు ఉన్నాడు. అతన్ని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.