అమెరికాలో జలపాతంలో జారిపడి తెలుగు ఇంజినీర్ మృతి...
అమెరికాలోని ఇతాకా జలపాతంలో పడి కెనడాకు చెందిన ఓ తెలుగు ఇంజనీర్ మృతి చెందాడు.
అమెరికా : కెనడా లో ఉండే ఓ తెలుగు యువకుడు అమెరికాలోని ఇతాకా జలపాతంలో పడిపోయి మృత్యువాత పడ్డాడు. ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన మెకానికల్ ఇంజనీరు నెక్కలపు హరీష్ చౌదరి (35) కుటుంబం విజయవాడ శివారులోని పోరంకిలో ఉంటుంది. ఇంజినీరింగ్ పూర్తయ్యాక పదేళ్లక్రితం కెనడాలోని ఆంటారియోకి వెళ్ళిన హరీష్ అక్కడ ‘టూల్ డిజైనర్ గా’ పని చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం సాయి సౌమ్యతో వివాహమైంది.
ప్రకృతి ప్రేమికుడైన హరీష్ విహారయాత్ర కోసం ఈనెల 8న ఐదుగురు స్నేహితులతో కలిసి అమెరికా వెళ్లారు. 11న న్యూయార్క్ లోని ఇతాకా జలపాతం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఫోటో దిగుతూ వెనక్కి జారిపడి నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయి మృతి చెందారు. ‘తానా’ సహకారంతో మృతదేహాన్ని స్వస్థలం చేర్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.
విషాదాంతం..కాలిఫోర్నియాలో ఎన్నారై ఫ్యామిలీ కిడ్నాప్, విగతజీవులుగా నలుగురు..
ఇదిలా ఉండగా, భారత సంతతికి చెందిన విద్యార్థి అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. ప్రసిద్ధ పుర్ డ్యూ యూనివర్సిటీ హాస్టల్ లో ఈ ఘటన జరిగింది. ఈ హత్యకు పాల్పడింది అతడి రూమ్మేటే. అతను కొరియాకు చెందినవాడు. తనను మృతుడు బ్లాక్మెయిల్ చేయడం వల్లే ఈ చర్యకు పాల్పడినట్లు అతడు అంగీకరించాడు. మృతుడు వరుణ్ మనీష్ చెడా (20) ఇండియానాపోలిస్ కు చెందినవాడు. గత బుధవారం యూనివర్సిటీ మెక్ కుచియాన్ హాల్ లో ఉన్నప్పుడు హత్యకు గురయ్యాడు. నిందితుడు జిన్ మిన్ జిమ్మీ షా(22).. సెబైర్ సెక్యూరిటీ కోర్స్ చేస్తున్నాడు.
షాను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా నేరం అంగీకరించాడు. మృతుడి తల్లి దండ్రులకు క్షమాపణలు చెప్పాడు. తనను బ్లాక్ మెయిల్ చేసినందుకే హత్య చేసినట్లు పేర్కొన్నాడు. అయితే ఏ విషయం గురించి అనేది మాత్రం అతను వెల్లడించలేదు. వరుణ్ ను రూమ్ లోనే పదునైన కత్తితో జిమ్మీ పొడిచినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతడే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. హత్యానంతరం ఆ గది రక్తపు మరకలతో నిండిపోయి ఉంది. అక్కడే ఉన్న కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా, అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఓ భారతీయ సంతతి యువకుడు హత్యకు గురయ్యాడు. తన డార్మెటరీలో 20 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన విద్యార్థి మృతిచెందాడు. దీనికి గానూ అతని కొరియన్ రూమ్‌మేట్‌ను అదుపులోకి తీసుకున్నట్లు మీడియా నివేదికలు తెలిపాయి. వరుణ్ మనీష్ ఛేడా అనే ఆ యువకుడు అక్కడి పర్డ్యూ యూనివర్శిటీలో చదువుతున్నాడు.
ఇండియానాపోలిస్ లో ఉంటున్నాడు. క్యాంపస్ పశ్చిమ అంచున ఉన్న మెక్‌కట్చియాన్ హాల్‌లో శవమై కనిపించినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. దీనికి గానూ అతని రూమ్మేట్ అయిన మరో యూనివర్శిటీ విద్యార్థిని హత్యానేరంపై బుధవారం అరెస్టు చేశారని అక్కడి పోలీసుల సమాచారం.