తెలుగు విద్యార్థి శరత్ హత్య కేసు.. నిందితుడి కాల్చివేత

sharath koppu death accused killed by police
Highlights


వరంగల్ కి చెందిన తెలుగు విద్యార్థి కొప్పు శరత్ ని.. అమెరికాలో దారుణంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే


వరంగల్ కి చెందిన తెలుగు విద్యార్థి కొప్పు శరత్ ని.. అమెరికాలో దారుణంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అమెరికాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో శరత్ ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. శరత్ చావుకి  కారణమైన నిందితుడు కూడా ఇప్పుడు ప్రాణాలు కోల్పోయాడు.

శరత్ పై కాల్పులు జరిపిన నాటి నుంచి నిందితుడి కోసం అక్కడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. తాజాగా అతని జాడ తెలుసుకోని పట్టుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులకు, నిందితుడికి మధ్య కాల్పుల కలకలం చోటుచేసుకుంది.

నిందితుడు పోలీసులపై ఎదురుదాడికి దిగడంతో.. అతనిపై కాల్పులు జరిపారు. దీంతో నిందితుడు ప్రాణాలు కోల్పోయాడు.

 

పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికాలోని రెస్టారెంట్ లో గత వారం జరిగిన కాల్పుల్లో తెలంగాణ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. అతని తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల శరత్ కొప్పుగా గుర్తించారు. 

అతను మిస్సోరి విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. కాల్పులు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జరిగాయి. కాన్సాస్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి బుల్లెట్ గాయాలతో శరత్ రక్తంమడుగులో పడి ఉన్నాడు. 

అతన్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అనుమానితులను ఎవరినీ ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలేదు. ఐదు బుల్లెట్లు కాల్చిన శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 

శరత్ కాన్సాస్ నగరంలో ఉంటున్నాడు. మిస్సోరి యూనివర్శిటీలో చదువుతూ 5303 చార్లోట్ స్ట్రీట్ అపార్టుమెంటులో ఉంటున్నాడు. అతని మరణ విషయం వరంగల్ జిల్లాలోని కుటుంబ సభ్యులకు చేరింది. శరత్ చనిపోయిన నాలుగు రోజులకు ప్రభుత్వ చొరవతో మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది.

శరత్ చంపిన వ్యక్తిని పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించగా.. చివరకు పోలీసుల కాల్పుల్లోనే నిందితుడు మృత్యువాత పడ్డాడు

loader