తిరుపతి: అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాలనలో హెచ్1 బీ వీసాపై ఉన్న తెలుగు విద్యార్థులు కష్టాలు పడుతున్నారని  తానా అధ్యక్షుడు సతీశ్‌ వేమన చెప్పారు. బుధవారం ఆయన తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. 

 హెచ్‌4బీ కింద అమెరికాలో పనిచేస్తున్న దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు పోతాయనే పుకార్లు ప్రచారంలో ఉన్నాయని, అయితే దీనికి సంబంధించి ప్రకటన వెలువడలేదని స్పష్టం చేశారు. వీసాల మంజూరులో ట్రంప్‌ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని అన్నారు. 

ప్రస్తుతం ఇచ్చిన వీసాల రెన్యువల్‌ విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అమెరికాలో నిబంధనలు సులభతరం చేయాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. 2019లో తానా మహాసభలు అమెరికాలో నిర్వహిస్తామని చెప్పారు.