Asianet News TeluguAsianet News Telugu

ఇండియన్ టెక్కీలకు షాక్: హెచ్-1 బీ వీసా ధరఖాస్తు రద్దైతే ఇక ఇంటికే

హెచ్-1 బీ వీసాదారులకు కష్టాలు  తప్పడం లేదు. గతంలో మాదిరిగా హెచ్-1 బీ వీసాలను  దక్కించుకోవడం  అంత సులువు కాదు.  వీసా నిబంధలను  ట్రంప్ అడ్మినిస్ట్రేషన్  కఠినతరం చేసింది. దీంతో  వీసా ధరఖాస్తులను ఆమోదింపజేసేందుకు  అమెరికా కఠిన వైఖరిని చూపే అవకాశం లేకపోలేదు.

Recent H-1B visa changes making it harder to fill job openings at US firms

న్యూఢిల్లీ: హెచ్-1 బీ వీసాదారులకు కష్టాలు  తప్పడం లేదు. గతంలో మాదిరిగా హెచ్-1 బీ వీసాలను  దక్కించుకోవడం  అంత సులువు కాదు.  వీసా నిబంధలను  ట్రంప్ అడ్మినిస్ట్రేషన్  కఠినతరం చేసింది. దీంతో  వీసా ధరఖాస్తులను ఆమోదింపజేసేందుకు  అమెరికా కఠిన వైఖరిని చూపే అవకాశం లేకపోలేదు.

అమెరికా అధ్యక్షుడుగా  ట్రంప్  బాధ్యతలు చేపట్టిన తర్వాత  హెచ్-1 బీ వీసాలు పొందడం గతంలో మాదిరిగా సులభం కాకుండా పోయింది.  ఈ వీసాలకు  అమెరికా నిబంధనలను మరింత కఠినం చేసింది.  అమెరికాలో పనిచేసేందుకు అనుమతి కోరుతూ  విదేశీయులు ఎక్కువగా ఈ వీసాల కోసం ధరఖాస్తులు చేస్తుండడంతో  నిబంధనలను అమెరికా కఠినతరం చేసింది.

 ఈ వీసాల ధరఖాస్తు సమయంలో   ఏదైనా తప్పులు, లోపాలు ఉంటే ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వాటిని తిరస్కరించే అధికారం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కు ఉంది.  యూఎస్‌ఐఎస్‌కు దరఖాస్తు సక్రమంగా ఉందని అనిపిస్తేనే ఆమోదిస్తుంది. ఎందుకు దరఖాస్తు తిరస్కరించారో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో మాదిరిగా నోటిఫికేషన్‌ పంపాల్సిన అవసరం కూడా లేదు.

ఈ కొత్త నిబంధనలు ఈ ఏడాది  సెప్టెంబరు 11 నుంచి అమలులోకి రానుంది. దీంతో హెచ్‌-1బీ వీసాదారులకు మరింత కష్టాలు ఎదురుకానున్నాయి. హెచ్‌-1బీ వీసా పొడిగింపు కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైనవారు  దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ దరఖాస్తు దారులు తమ అప్లికేషన్‌లో ఎలాంటి లోపాలు లేకున్నా తిరస్కరణకు గురైనట్లు భావిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.ఈ కొత్త నిబంధనల ప్రభావం భారతీయ ఐటీ ఉద్యోగులు, దేశీయ ఐటీ కంపెనీలపై తీవ్రంగా పడే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios