అమెరికాలోని ఎయిర్ పోర్ట్ ప్రమాదంలో గుంటూరుకు చెందిన ఎన్ఆర్ఐ మృతి..

అమెరికా ఎయిర్ పోర్టులో జరిగిన ఓ బస్సు ప్రమాదంలో గుంటూరుకు చెందిన ఓ ఎన్ఆర్ఐ మృతి చెందాడు. 

NRI from Guntur died in an airport accident in America - bsb

న్యూయార్క్ : అమెరికాలోని విమానాశ్రయంలో జరిగిన బస్సు ప్రమాదంలో భారతీయ అమెరికన్ ఒకరు దుర్మరణం పాలయ్యారు.   అమెరికాకు వచ్చిన స్నేహితుడికి స్వాగతం పలికేందుకు తెలుగు వ్యక్తి అయిన ఆ భారతీయ అమెరికన్ ఎయిర్పోర్టుకు వచ్చాడు. ఈ ఘటన మార్చి 28న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  చనిపోయిన వ్యక్తిని విశ్వచంద్ కోళ్ల (47)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. 

విశ్వచంద్ స్నేహితుడైన ఒక సంగీత కళాకారుడు అమెరికాకు వచ్చాడు. అతను మసాచుసెట్స్ రాష్ట్ర రాజధాని బోస్టన్ సిటీ లోని  లోగన్ అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. అతనికి స్వాగతం పలికేందుకు విశ్వచంద్ ఆ ఎయిర్ పోర్టుకు వెళ్లారు. మార్చి 28న సాయంత్రం ఐదు గంటల సమయంలో ఎస్వీయూలో అక్కడికి చేరుకుని.. టెర్మినల్ బి దగ్గర స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో.. డార్డ్ మౌత్ ట్రాన్స్పోర్టేషన్ బస్సు ఒకటి.. ప్రయాణికులు, లగేజీతో అటుగా వచ్చింది. అది వెడుతూ, వెడుతూ విశ్వచంద్ ను పక్కనుంచి గుద్దుకుంటూ వెళ్లిపోయింది. 

డబ్బులు తీసుకుంటూ సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు: ఏపీ మంత్రి ధర్మాన సంచలనం

ఈ క్రమంలో విశ్వచంద్ రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయాడు. ఆ రెండు వాహనాల మధ్య నలిగిపోయి అక్కడే పడిపోయాడు. అది గమనించిన సిబ్బంది వెంటనే అతడిని అక్కడి నుంచి తరలించి ప్రధమ చికిత్స చేశారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. క్షణాల్లో జరిగిపోయిన ఈ ఘటనతో ఎయిర్పోర్టులోనే మిగతావారు షాక్ కు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రేపల్లెకి చెందిన విశ్వచంద్ అమెరికాలోని తకేడా ఫార్మసోటికల్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. 

అక్కడ గ్లోబల్ ఆంకాలజీ విభాగంలో డాటా అనలిస్టుగా పనిచేస్తున్న ఆయనకు భార్య సౌజన్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనుకోని ప్రమాదంలో అకస్మాత్తుగా మృతి చెందిన విశ్వచంద్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి బంధువులు నడుం బిగించారు. ఇప్పటికే 4,06,151 డాలర్లు.. అంటే  దాదాపుగా 3.3 కోట్ల వరకు విరాళాలు సేకరించారు. 

మార్చి 28న బోస్టన్‌లోని లోగాన్ విమానాశ్రయంలో బస్సు ఢీకొనడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 47 ఏళ్ల డేటా అనలిస్ట్ చనిపోయాడు.  అతను తన కారును పార్క్ చేసి - కారు బయట, డ్రైవర్ సీటు వైపు స్నేహితుడి కోసం వేచి ఉన్న సమయంలో ప్రమాదం జరిగింది.
స్థానిక సమాచారం ప్రకారం, బస్సు కొల్లాను ఢీకొట్టింది. కొద్ది దూరం ఈడ్చుకువెళ్లింది. ఇది గమనించిన స్థానిక అగ్నిమాపక విభాగం, బోస్టన్ అత్యవసర సేవల సిబ్బందితో పాటు ఓ నర్సు అతన్ని రక్షించడానికి ప్రయత్నించారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే కొల్లా మృతి చెందాడు. 

ఈ సమయంలో 54 ఏళ్ల మహిళ బస్సు నడుపుతోంది. ఆమె గాయపడలేదు. ఈ కేసు విచారణలో ఇప్పటి వరకు ఆమెపై ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని స్థానిక మీడియా పేర్కొంది.
1976లో గుంటూరులోని రేపల్లెలో జన్మించిన కొల్లా 1997లో అమెరికాకు వెళ్లారు. పక్కవారికి సాయం చేయాలంటే ముందుంటారని, ఆధ్యాత్మికంగా కూడా మంచి లోతైన అవగాహన ఉన్న వ్యక్తి అని అని స్నేహితులు, బంధువులు చెబుతున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios