ఆ దుర్మార్గుడిని చంపకుండా అలా చేయాల్సింది: శరత్ కొప్పుల కుటుంబీకులు

అమెరికాలో దారుణహత్యకు గురైన తెలుగు విద్యార్థి శరత్ కొప్పులను చంపిన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయకుండా ఉండాల్సిందన్నారు

koppula sarat relatives comments on encounter aginst sarat killer

అమెరికాలో దారుణహత్యకు గురైన తెలుగు విద్యార్థి శరత్ కొప్పులను చంపిన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయకుండా ఉండాల్సిందన్నారు.. శరత్ కుటుంబసభ్యులు. హింసకు హింస సమాధానం కాదని.. మా అబ్బాయిని చంపిన నిందితుడు ఎన్‌కౌంటర్‌లో చనిపోయినందుకు సంతోషంగా ఉందని.. కానీ ఆ దుర్మార్గుడిని అరెస్ట్  చేసి జైల్లో పెట్టి నరకం అనుభవించేలా చేసుంటే బాగుండేదని శరత్ మేనమామ శివుడు.

ఆ దుర్మార్గుడు ఎలా చచ్చాడన్నది ముఖ్యం కాదు.. ఏం చేసినా శరత్ తిరిగిరాడు.. కానీ నిందితుడు చనిపోయాడన్న విషయం వార్తల్లో చూసి తెలుసుకున్నామన్నారు. అమెరికా నుంచి శరత్ భౌతికకాయాన్ని ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వం సాయం చేసింది. కానీ పరిహారం పరంగా ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదని.. మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడం కోసం రూ.30 లక్షలు ఖర్చు చేశామని మరో బంధువు తెలిపారు.

వరంగల్‌కు చెందిన శరత్ అనే యువకుడు అమెరికాలోని కన్సాస్‌లో చదువుకుంటూ స్థానిక రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు.. అతనిపై ఓ దుండగుడు కాల్పులు జరపడంతో శరత్ మరణించాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios