అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి వరుణ్ రాజ్ మృతి ..

ఉన్నత చదువుల నిమిత్తం ఏడాదిన్నర క్రితం అమెరికాకు వెళ్ళిన వరుణ్ రాజ్ కత్తిపోట్లకు గురై, మృతి చెందాడు. 

Khammam student Varun Raj, who was stabbed in America, died - bsb

ఖమ్మం : అమెరికాలో ఓ జిమ్ లో గుర్తుతెలియని వ్యక్తి దాడిలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి వరుణ్ రాజ్ మృతి చెందాడు. అక్టోబర్ 31న జరిగిన ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన వరుణ్ రాజ్ అప్పటినుంచి అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  వెంటిలేటర్ మీద వరుణ్ రాజ్ కు చికిత్స అందించారు. అయినా, అతనికి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో అతను మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.  

దీంతో వరుణ్ రాజ్ ఇంట్లో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మామిళ్ళగూడెం ప్రాంతానికి చెందిన వరుణ్ రాజ్ ఉన్నత చదువుల నిమిత్తం ఏడాదిన్నర క్రితం అమెరికాకు వెళ్ళాడు. ఇండియానా రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాడు. అక్టోబర్ 31వ తేదీన అమెరికాలోని ఓ జిమ్ లో ఉండగా..అప్పుడే జిమ్ లోకి వచ్చిన ఓ వ్యక్తి అతని మీద కత్తితో దాడి చేశాడు.

అమెరికాలో కత్తిపోట్లు : ఇంకా విషమంగానే వరుణ్ రాజ్ ఆరోగ్యపరిస్థితి..

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వరుణ్ రాజ్ ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే అపస్మారపు స్థితిలోకి చేరుకున్న వరుణ్ రాజ్ కు వైద్యులు అత్యవసరంగా చికిత్సను ప్రారంభించారు. తలకు బలమైన గాయం కావడం.. మెదడుకు దెబ్బ తగలడంతో.. వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. కానీ, అతని పరిస్థితి విషమంగానే ఉందని.. ఇందులో మంచి బయటపడినా జీవితకాలం అంగవైకల్యం బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. 8 రోజుల తర్వాత మృత్యువుతో పోరాడి వరుణ్ రాజు మృతి చెందాడు. వరుణ్ రాజ్ తండ్రి  రామ్మూర్తి మహబూబాబాద్ జిల్లాలో టీచరుగా పనిచేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, అక్టోబర్ 31న అమెరికాలో ఓ తెలుగు విద్యార్థిపై కత్తితో దాడి జరిగింది. జిమ్ లో ఉన్న వరుణ్ అనే యువకుడిపై దుండగులు కత్తితో దాడి చేశారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. వరుణ్ పరిస్థితి విషమంగా ఉంది. వరుణ్ తలమీద దుండగుడు కత్తితో దాడి చేశాడు. దీనివల్ల మెదడుకు గాయం అయ్యింది. వరుణ్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. అతనికి ఐసియులో చికిత్స చేస్తున్నారు. వరుణ్ స్వస్థలం తెలంగాణలోని ఖమ్మం జిల్లాగా గుర్తించారు. 

దాడికి పాల్పడింది జోర్డాన్ ఆండ్రేడ్ అనే వ్యక్తిగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. జిమ్ లో నిందితుడు ప్రవేశించే సమయానికి వరుణ్ మసాజ్ కుర్చీపై కూర్చుని ఉన్నాడు. వరుణ్ ను చూసి ఆండ్రేడ్ ఆందోళనకు గురయ్యాడు. తనమీద వరుణ్ దాడి చేస్తాడని భయపడి, జేబులోని కత్తితో దాడి చేసినట్లుగా పోలీసులకు తెలిపాడు. నిందితుడు ఆండ్రేడ్ ను కోర్టులో హాజరుపరిచారు.

మరోవైపు అమెరికాలో తెలుగు విద్యార్థిపై దాడి కేసులో తెలంగాణ మంత్రి కేటీఆర్ నవంబర్ 1న స్పందించారు. వారికి కావాల్సిన సహాయసహకారాలను అందిస్తామని తెలిపారు. అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం, తెలంగాణ ఎన్నారై స్నేహితుల సహాయంతో వరుణ్‌కు కావాల్సిన సహకారాన్ని అందించడానికి తమ వంతు కృషి చేస్తామని.. కేటీఆర్ ఎక్స్ లో పేర్కొన్నారు.

వరుణ్ కుటుంబసభ్యులతో తన టీం టచ్ లో ఉంటారని, కావాల్సిన సహాయం అందిస్తారని చెబుతూ..వరుణ్ పరిస్థితిపై మానసా కాపురి అనే డాక్టర్ చేసిన ట్వీట్ ను షేర్ చేశారు మంత్రి కేటీఆర్. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios