Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో కత్తిపోట్లు : ఇంకా విషమంగానే వరుణ్ రాజ్ ఆరోగ్యపరిస్థితి..

వరుణ్ రాజ్ కోమానుంచి బయటపడితే జీవితాంతం శాశ్వత అంగ వైకల్యంతో ఉంటాడు. కంటిచూపు పాక్షికంగా దెబ్బతినొచ్చు. శరీరం ఎడమ వైపు బలహీనంగా, పనిచేయకుండా అవ్వొచ్చు.

Indian student stabbed in america after three day still in critical condition - bsb
Author
First Published Nov 2, 2023, 2:17 PM IST | Last Updated Nov 2, 2023, 2:17 PM IST

అమెరికా : తెలంగాణకు చెందిన వరుణ్ రాజ్ అనే విద్యార్థిపై అమెరికాలో మూడు రోజుల క్రితం దాడి జరిగింది. జిమ్ లో ఉన్న అతనిపై ఓ వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తలకు తీవ్రగాయాలయ్యాయి. మెదడుకు గాయాలైనట్లుగా పోలీసులు తెలిపారు. మూడు రోజులు గడుస్తున్నా అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం. 

కంప్యూటర్ సైన్స్ విద్యార్థి పి వరుణ్ రాజ్‌ను ఆదివారం ఉదయం పబ్లిక్ జిమ్‌లో జోర్డాన్ ఆండ్రేడ్ (24) అనే దుండగుడు కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. 

"మూడు రోజుల చికిత్స తర్వాత, వరుణ్ లైఫ్ సపోర్టు మీద ఉన్నాడు. అతడికి తీవ్రమైన నరాల బలహీనత ఉంది. బతికినా జీవితాంతం శాశ్వత అంగ వైకల్యంతో ఉంటాడు. కంటిచూపు పాక్షికంగా దెబ్బతినొచ్చు. శరీరం ఎడమ వైపు బలహీనంగా, పనిచేయకుండా అవ్వొచ్చు’’ అని తెలిపాయి.

అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కత్తులతో దాడి.. స్పందించిన మంత్రి కేటీఆర్..

ఈ సంఘటన తరువాత, దాడి చేసిన, జోర్డాన్ ఆండ్రేడ్ (24)ను అరెస్టు చేశారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో వరుణ్‌ని ఇప్పుడు ఫోర్ట్ వేన్‌లోని లూథరన్ ఆసుపత్రికి తరలించారు.

జోర్డాన్ ఆండ్రేడ్ ను పోర్టర్ సుపీరియర్ కోర్ట్ జడ్జి ముందు హాజరుపరిచారు. నిందితుడు నేరం అంగీకరించినట్టుగా సమాచారం.  న్యాయమూర్తి అతనికి 500,000 డాలర్ల నగదు బాండును, మరో 500,000 డాలర్లు ష్యూరిటీగా విధించారు. 

వరుణ్ రాజ్ చదువుకుంటున్న యూనివర్శిటీ ప్రెసిడెంట్ తమ విద్యార్థిపై జరిగిన పాశవిక దాడి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “వరుణ్ రాజ్‌పై జరిగిన దాడితో మేము దిగ్భ్రాంతి చెందాం. అతని స్నేహితులు, కుటుంబ సభ్యులందరికీ త్వరగా కోలుకుని రావాలని ప్రార్తిస్తున్నామని చెప్పడంతప్ప ఏమీ చేయలేం’ అని యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఒక ప్రకటనలో తెలిపారు.

వరుణ్ రాజ్ చికిత్స కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) GoFundలో నిధులు సమీకరిస్తోంది. బుధవారం రాత్రి నాటికి 38,000 డాలర్లకు పైగా సేకరించింది. "ప్రస్తుతం, వరుణ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, కోమాలో పోరాడుతున్నాడు. అతని వైద్యానికి అయ్యే ఖర్చులు, అతని తల్లిదండ్రులు అమెరికా రావడం కోసం అయ్యేప్రయాణ ఖర్చులను భరించేందుకు మా మద్దతును కోరుతున్నారు ”అని నాట్స్ తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios