Asianet News TeluguAsianet News Telugu

వాషింగ్టన్ లో భారతీయ సంతతి యువకుడి హత్య, రూమ్మేట్ అరెస్ట్..

భారతీయ సంతతికి చెందిన వరుణ్ మనీష్ ఛేడా అనే యువకుడు పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అతను అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని తన డార్మిటరీలో శవమై కనిపించాడు.

Indian Origin Student Killed In US, Friends Heard Screams On Call
Author
First Published Oct 6, 2022, 12:47 PM IST

వాషింగ్టన్ : అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఓ భారతీయ సంతతి యువకుడు హత్యకు గురయ్యాడు. తన డార్మెటరీలో 20 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన విద్యార్థి మృతిచెందాడు. దీనికి గానూ అతని కొరియన్ రూమ్‌మేట్‌ను అదుపులోకి తీసుకున్నట్లు మీడియా నివేదికలు తెలిపాయి.

వరుణ్ మనీష్ ఛేడా అనే ఆ యువకుడు అక్కడి పర్డ్యూ యూనివర్శిటీలో చదువుతున్నాడు. ఇండియానాపోలిస్‌ లో ఉంటున్నాడు. క్యాంపస్ పశ్చిమ అంచున ఉన్న మెక్‌కట్చియాన్ హాల్‌లో శవమై కనిపించినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. దీనికి గానూ అతని రూమ్మేట్ అయిన మరో యూనివర్శిటీ విద్యార్థిని హత్యానేరంపై బుధవారం అరెస్టు చేశారని అక్కడి పోలీసుల సమాచారం. 

కొరియాకు చెందిన జూనియర్ సైబర్ సెక్యూరిటీ మేజర్అంతర్జాతీయ విద్యార్థి అయిన జి మిన్ “జిమ్మీ” షా బుధవారం ఉదయం 12:45 గంటలకు 911కి కాల్ చేశాడు. యువకుడి మృతి గురించి పోలీసులను అప్రమత్తం చేసినట్లు పర్డ్యూ యూనివర్సిటీ పోలీస్ చీఫ్ లెస్లీ వైట్ బుధవారం ఉదయం తెలిపారు. కాల్ వివరాలను పూర్తిగా వెల్లడించలేదు. కానీ, మెక్‌కట్చియాన్ హాల్ మొదటి అంతస్తులోని ఓ గదిలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

విషాదాంతం..కాలిఫోర్నియాలో ఎన్నారై ఫ్యామిలీ కిడ్నాప్, విగతజీవులుగా నలుగురు..

ఛడ్డా యూనివర్సిటీలో డేటా సైన్స్ చదువుతున్నాడు. ఛడ్డా శరీరం మీద అనేక తీవ్ర గాయాలున్నాయని.. దీన్ని బట్టి ఇది హత్య అయి ఉండొచ్చని ప్రాథమిక సమాచారంగా పోలీసులు భావిస్తున్నారు. ఇది ప్రేరిపించడం వల్లో, ఇంకేదో కారణం వల్లో జరిగి ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

చెఢా చిన్ననాటి స్నేహితుడు అరుణాభ్ సిన్హా మాట్లాడుతూ, మంగళవారం రాత్రి చెఢా ఆన్‌లైన్‌లో స్నేహితులతో గేమింగ్ ఆడుతూ, మాట్లాడుతున్నాడని, అంతలోనే అకస్మాత్తుగా కాల్‌లో అరుపులు వినిపించాయని చెప్పారు. అయితే సిన్హా... ఆ సమయంలో ఫ్రెండ్స్ తో గేమ్ ఆడడం లేదని.. అయితే, పక్కనే ఉండడం వల్ల అరుపులు విన్నాడని.. ఏం జరిగిందో తనకు పూర్తిగా తెలియదని అన్నారు. అది గేమ్ లో భాగం అనుకున్నారు. అయితే బుధవారం ఉదయం అతని మృతి వార్త తెలియడంతో వారు నిద్ర లేచారుని చెప్పారు.

911 కాల్ వచ్చిన కొద్ది నిమిషాలకే అనుమానితుడైన 22 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు వైటే చెప్పారు. ఇలా ఓ యువకుడు క్యాంపస్ లో హత్యకు గురికావడం ఎనిమిది సంవత్సరాలలో ఇదే మొదటిదని పోలీసులు తెలిపారు.

పర్డ్యూ యూనివర్సిటీ ప్రెసిడెంట్ మిచ్ డేనియల్స్ మాట్లాడుతూ, ‘చెఢా మా క్యాంపస్‌లో చదువుతూ చనిపోవడం.. మేము ఊహించలేనంత విషాదకరమైన సంఘటన" అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios