అమెరికాలో భారత సంతతి మహిళ సంచలనం..!

ఈ క్రమంలో పెన్సిల్వేనియా స్టేట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ డిసెంబర్ 9న ఆమెను వర్శిటీ తదుపరి అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం జరిగింది. 2022లో ఆమె ఈ పదవి చేపట్టనున్నారు. ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల బెండపూడి ఆనందం వ్యక్తం చేశారు.     
 

Indian origin Neeli Bendapudi scripts history, becomes 1st woman to be president of Penn State University

అమెరికాలో భారత సంతతి మహిళ సంచలనం సృష్టించారు. అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా భారతీయ సంతతికి చెందిన ప్రొఫెసర్ నీలి బెండపూడి నియమితులయ్యారు. దీంతో ఈ పదవి చేపట్టబోతున్న తొలి మహిళ, శ్వేతజాతీయేతరాలుగా ఆమె చరిత్రకెక్కారు. ఈ మేరకు గురువారం యూనివర్శిటీ ఆమె నియామకాన్ని ధృవీకరించింది. 

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన బెండపూడి.. ఉన్నత విద్య కోసం 1986లో అమెరికాకు వెళ్లారు. అనంతరం అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె లూయిస్ విల్లే యూనివర్శిటీలో మార్కెటింగ్ ప్రొఫెసర్‌గాను, వర్శిటీ అధ్యక్షురాలిగాను కొనసాగుతున్నారు. ఈ క్రమంలో పెన్సిల్వేనియా స్టేట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ డిసెంబర్ 9న ఆమెను వర్శిటీ తదుపరి అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం జరిగింది. 2022లో ఆమె ఈ పదవి చేపట్టనున్నారు. ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల బెండపూడి ఆనందం వ్యక్తం చేశారు.     

Also Read: Genome Sequencing Lab: త్వ‌ర‌లో ఏపీలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్.. సీసీఎంబీతో ఒప్పందం

పెన్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నీలి బెండపూడిని తదుపరి అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా పేర్కొన్నట్లు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు ఆమె అకాడమీలో దాదాపు 30 సంవత్సరాలుగా మార్కెటింగ్‌ విభాగంలో బోధించడమే కాక కాన్సాస్ విశ్వవిద్యాలయంలో అత్యున్నత అధికారిగా, ఎగ్జిక్యూటివ్ వైస్ ఛాన్సలర్‌గా, యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్‌లో స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్‌గా, ఓహియో స్టేట్ యూనివర్శిటీలో ఇనిషియేటివ్ ఫర్ మేనేజింగ్ సర్వీసెస్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా సేవలందించారు. పైగా ఆమె తన వృత్తిని విద్యార్థుల విజయానికి అంకితం చేసింది.

Also Read: మెక్సికోలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 49 మంది మృతి

అయితే ఆమె వచ్చే ఏడాది 2022లో పెన్ స్టేట్ 19వ ప్రెసిడెంట్‌గా సేవలందించనున్నారు. ఈ మేరకు నీలి బెండపూడి మాట్లాడుతూ.."పెన్ స్టేట్ ఒక ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం. ఈ అత్యుత్తమ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందితో కలిసి పనిచేయడాన్ని నెనెంతో గర్వంగా భావిస్తున్నా. అంతేకాదు పెన్ స్టేట్ యూనివర్సిటీని కొత్త శిఖరాలకు చేరుకునేలా పనిచేయడమే నా ధ్యేయం" అని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios