Pervez Musharraf :పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఫర్వేజ్ ముషారఫ్‌కు ఉరిశిక్ష

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఫర్వేజ్ ముషారఫ్‌ కు ఉరి శిక్ష విధిస్తూ పాకిస్తాన్ కోర్టు మంగళవారం నాడు తీర్పు చెప్పింది. 

Musharraf gets death penalty in high treason case

ఇస్లామాబాద్:పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఫర్వేజ్ ఫర్వేజ్ ముషారఫ్‌కు  ఉరి శిక్షను విధిస్తూ మంగళవారం నాడు పాకిస్తాన్  కోర్టు తీర్పు చెప్పింది.  దేశ ద్రోహం కేసులో పాకిస్తాన్ కోర్టు ఈ తీర్పు చెప్పింది.

పాకిస్తాన్ రాజ్యాంగంలోని  ఆర్టికల్ 6 ప్రకారంగా  తీవ్రమైన దేశ ద్రోహానికి పాల్పడినట్టుగా ప్రత్యేక న్యాయస్థానం అభిప్రాయపడింది. పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు ఫర్వేజ్ ముషారఫ్‌ తీవ్రమైన దేశద్రోహానికి పాల్పడినట్టుగా అభిప్రాయపడింది.

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఫర్వేజ్ ముషరఫ్ ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకొన్నాడు. 2007 నవంబర్ 3వ తేదీన పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీని విధించినందుకు ఫర్వేజ్ ముషారఫ్‌ పై కేసు నమోదైంది.

2013లో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఫర్వేజ్ ముషారఫ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది.  ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని రద్దు చేసి సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ కేసు నమోదైంది.2014 లోనే ఫర్వేజ్ ముషారఫ్‌పై స్పెషల్ కోర్టులో సెప్టెంబర్ మాసంలో సాక్ష్యాలను కోర్టు ముందు ప్రవేశపెట్టారు.  

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఫర్వేజ్ ముషరఫ్ ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకొన్నాడు.లండన్‌లో ముషరఫ్ ఉన్నట్టుగా సమాచారం. 2007 నవంబర్ 3వ తేదీన పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీని విధించినందుకు ఫర్వేజ్ ముషారఫ్‌ పై కేసు నమోదైంది.

2013లో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఫర్వేజ్ ముషారఫ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది.  ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని రద్దు చేసి సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ కేసు నమోదైంది.

 2014 లోనే ఫర్వేజ్ ముషారఫ్‌పై స్పెషల్ కోర్టులో సెప్టెంబర్ మాసంలో సాక్ష్యాలను కోర్టు ముందు ప్రవేశపెట్టారు.  1999 నుండి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడుగా ముషరఫ్ ఉన్నాడు.  ప్రస్తుతం ఫర్వేజ్ ముషరఫ్ దుబాయ్‌లో ఉంటున్నాడు. దుబాయ్ నుండి ముషరఫ్‌ను తీసుకురావడం ఆషామాషీ కాదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమఃతున్నాయి.  

తనపై నమోదైన  దేశ ద్రోహం కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఫర్వేజ్ ముషారప్ కోరారు. అయితే సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేసింది.

2007లో ప్రజా ప్రభుత్వాన్ని రద్దు చేసి పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీని విధించినందుకు గాను ముషారఫ్ పై దేశద్రోహం కేసు నమోదైంది.

ఆరోగ్య పరిస్థితి బాగా లేదని ముషారఫ్ 2016లో పాకిస్తాన్ నుండి దుబాయ్‌కు వెళ్లిపోయాడు. తన ఆరోగ్యం కుదుటపడే వరకు కేసు తీర్పును ఇవ్వాలని ముషారఫ్ చేసిన వినతిని కోర్టు తోసిపుచ్చింది.

దుబాయ్‌లో ఉన్న ఫర్వేజ్ ముషారఫ్‌ను పాకిస్తాన్‌కు రప్పించేందుకు పాకిస్తాన్ అంత సులభమయ్యే పరిస్థితి కాదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.ఈ శిక్షను అమలు చేసేందుకు దుబాయ్ నుండి ముషారఫ్ ను పాకిస్తాన్ ను రప్పించాలి.

ముషారఫ్‌ను దుబాయ్‌ నుండి రప్పించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం దుబాయ్‌ ప్రభుత్వంతో చర్చించాల్సి ఉంటుంది.దుబాయ్ ప్రభుత్వం ఒప్పుకొంటే పాకిస్తాన్‌‌కు ముషారప్‌ను అప్పగించే అవకాశం ఉంది. దుబాయ్ ప్రభుత్వం ఒప్పుకోకపోతే పాకిస్తాన్ ఎలా స్పందిస్తోందో చూడాలి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios