అమెరికా వీధుల్లో ఆకలితో అలమటిస్తున్న హైదరాబాద్ మహిళ.. కేంద్ర మంత్రి జై శంకర్ సాయం కోరిన తల్లి..

అమెరికాలోని వీధుల్లో హైదరాబాద్‌కు చెందిన  ఓ మహిళ అకలితో అలమటిస్తుంది. డిప్రెషన్‌తో పోరాడుతున్న ఆమె.. తన వస్తువులు చోరీకి గురై ఆకలితో అలమటిస్తూ చికారో రోడ్లపై తిరుగుతున్నట్టుగా చెబుతున్నారు.

Hyderabad woman starves on US street and mother appeals for help ksm

అమెరికాలోని వీధుల్లో హైదరాబాద్‌కు చెందిన  ఓ మహిళ అకలితో అలమటిస్తుంది. డిప్రెషన్‌తో పోరాడుతున్న ఆమె.. తన వస్తువులు చోరీకి గురై ఆకలితో అలమటిస్తూ చికారో రోడ్లపై తిరుగుతున్నట్టుగా చెబుతున్నారు. దీంతో ఆ మహిళను తిరిగి భారత్‌కు తీసుకొసురావాలని ఆమె కుటుంబ సభ్యులు  కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బీఆర్ఎస్ నేత ఖలీకర్ రెహమాన్ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన సైదా లులు మిన్హాజ్ జైదీ.. డెట్రాయిట్‌లోని TRINE విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదివేందుకు వెళ్లారని.. అయితే ఆమె చికాగోలో దీన స్థితిలో కనిపించిందని పేర్కొన్నారు. మిన్హాజ్ జైదీని తిరిగి స్వదేశానికి తీసురావాలని కోరుతూ ఆమె తల్లి కేంద్ర మంత్రి జై శంకర్‌కు లేఖ రాసినట్టుగా పేర్కొన్నారు. 

ఇక, లేఖలో “తెలంగాణలోని మౌలాలీ నివాసి అయిన నా కుమార్తె ససైదా లులు మిన్హాజ్ జైదీ 2021 ఆగస్టులో డెట్రాయిట్‌లోని ట్రినే విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చదివేందుకు వెళ్లి మాతో తరచుగా టచ్‌లో ఉండేది. కానీ గత రెండు నెలలుగా ఆమె నాతో టచ్‌లో ఉండడం లేదు. అయితే నా కూతురు డిప్రెషన్‌లో ఉందని, ఆమె సామాన్లు ఎవరో దొంగిలించారని, దీంతో ఆమె ఆకలితో అలమటించిందని ఇద్దరు హైదరాబాద్ యువకుల ద్వారా మాకు తెలిసింది. అమెరికాలోని చికాగో రోడ్లపై నా కూతురు కనిపించింది’’ మహిళా తల్లి లేఖలో పేర్కొంది. 

 


వాషింగ్టన్ డీసీ లోని భారత రాయబార కార్యాలయం, చికాగోలోని భారత కాన్సులేట్ జోక్యం చేసుకుని తన కుమార్తెను తిరిగి తీసుకురావాలని ఆమె అభ్యర్థిస్తోంది. మహ్మద్ మిన్హాజ్ అఖ్తర్ సహాయంతో తన కుమార్తెను గుర్తించవచ్చని ఆమె పంచుకున్నారు. సోషల్ యాక్టివిస్ట్ మహ్మద్ మిన్హాజ్ అఖ్తర్ సహాయంతో తన కుమార్తెను గుర్తించవచ్చని ఆమె వివరాలను లేఖలో పొందరుపరిచారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios