Asianet News TeluguAsianet News Telugu

నెదర్లాండ్స్ లో అగ్ని ప్రమాదం.. తెలంగాణ వాసి మృతి..

అతనికి నెదర్లాండ్స్ కి సంబంధించిన పర్మినెంట్ వీసా ఉంది. కాగా 2022 జనవరి 5న రాత్రి హెగ్ నగరంలో అతడు నివసిస్తున్న ష్విల్డెర్‌షిజ్‌ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అందులో తీవ్ర గాయాలపాలైన అబ్దుల్ హాదీని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 24 గంటల అనంతరం తుది శ్వాస విడిచాడు.

 

Hyderabad man dies in fire accident in Netherlands
Author
Hyderabad, First Published Jan 7, 2022, 2:15 PM IST

హైదరాబాద్ : Netherlands రాజధాని హెగ్ లో ఓ భవంతిలో చోటు చేసుకున్న 
Fire hazardలో తీవ్రంగా గాయపడిన హైదరాబాద్ వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతనికి అంత్యక్రియలు నిర్వహించేందుకు నగరంలో ఉన్న కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. నగరంలోని అసిఫ్ నగర్ కి చెందిన అబ్దుల్ హాదీ (43) కొన్నేళ్లుగా నెదర్లాండ్ లోని హేగ్ నివసిస్తున్నాడు.

అతనికి నెదర్లాండ్స్ కి సంబంధించిన పర్మినెంట్ వీసా ఉంది. కాగా 2022 జనవరి 5న రాత్రి హెగ్ నగరంలో అతడు నివసిస్తున్న ష్విల్డెర్‌షిజ్‌ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అందులో తీవ్ర గాయాలపాలైన అబ్దుల్ హాదీని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 24 గంటల అనంతరం తుది శ్వాస విడిచాడు.

చివరిసారిగా అబ్దుల్ హాదీ 2021 జనవరిలో ఇండియా వచ్చాడు. తిరిగి మార్చిలో నెదర్లాండ్స్కు వెళ్ళిపోయాడు. త్వరలోనే మళ్ళీ ఇంటికి వస్తానని చెప్పిన కొడుకు ఇంతలోనే తమకు శాశ్వతంగా దూరమయ్యాడని మృతుడి తండ్రి మహ్మద్ అహ్ సాన్ కంటతడి పెట్టుకున్నారు. తమ కొడుకు మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా ఇండియాకి తరలించాలని భారత విదేశాంగ శాఖ మంత్రి, నెదర్లాండ్స్ ఇండియన్ ఎంబసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. 

ఇదిలా ఉండగా, 2021 డిసెంబర్ 21న అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరిగిన కారు ప్రమాదంలో జనగామకు చెందిన NRI కుమారుడు దుర్మరణం చెందాడు. ఆయన కూతురు ప్రాణాల కోసం ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నది. ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలిసింది. ఈ దుర్ఘటనతో జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం బండ్లగూడెం గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

బండ్లగూడెం గ్రామానికి చెందిన చెట్టిపల్లి రామచంద్రా రెడ్డి టెకీ. సుమారు 20 ఏళ్ల నుంచి ఆయన అమెరికాలోని జీవిస్తున్నాడు. ఆయన భార్య రజిత రెడ్డితో కలిసి అక్కడే స్థిరపడ్డాడు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు అర్జిత్ రెడ్డి(14), కూతురు 16 ఏళ్ల అక్షిత ఉన్నది. అమెరికా శాశ్వత నివాస కార్డుదారులు వీరు. స్నేహితుడి ఇంట్లో బర్త్ డే సెలబ్రేషన్స్‌కు వెళ్లి రామచంద్రా రెడ్డి కుటుంబం తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రామచంద్రా రెడ్డి, రజితలు కారులో ముందు కూర్చుండగా, అర్జిత్ రెడ్డి, అక్షితలు వెనకలా కూర్చున్నారు. లాస్ ఏంజెల్స్‌లోని ఓ కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆపారు. అంతలోనే ఓ మహిళ మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసుకుంటూ భారీ వేగంతో వచ్చి రామచంద్రా రెడ్డి కారును వెనుక నుంచి ఢీ కొట్టింది.

ఈ ఘటనలో కారులో వెనుక కూర్చున్న అర్జిత్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాగా, మిగితా ముగ్గురిని హాస్పిటల్‌కు చికిత్స కోసం తరలించారు. ఈ ముగ్గురిలో అక్షిత ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనతో బండ్లగూడెంలో విషాదం నెలకొంది. మరో పది నిమిషాలైతే వారు తమ ఇల్లు చేరుకుంటారనే సమయంలో.. దూరంలో.. ఈ దుర్ఘటన జరిగినట్టు బండ్లగూడెంలోని రామచంద్రా రెడ్డి సహోదరుడు రవీందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రమే తమకు ఈ కారు యాక్సిడెంట్ సమాచారం తెలిసిందని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios