అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువతి దుర్మరణం..
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన యువతి మృతిచెందింది. ఉన్నత చదవుల కోసం అమెరికాకు వెళ్లిన యువతి.. అక్టోబర్ 15వ తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన యువతి మృతిచెందింది. ఉన్నత చదవుల కోసం అమెరికాకు వెళ్లిన యువతి.. అక్టోబర్ 15వ తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన ప్రతీక్ష కున్వర్ హైందవి కాలేజీలో అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లింది. కాన్సాస్‌లోని ఓ యూనివర్సిటీలో చదవుతుంది. అక్టోబర్ 15వ తేదీ రాత్రి ప్రతీక్ష, తన సోదరి ప్రియాంక, స్నేహితుడు సాయి తేజ, డ్రైవర్ వరుణ్‌తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రతీక్ష ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సాయితేజ, ప్రియాంకలకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ప్రతీక్ష అక్కడికక్కడే మృతి చెందింది. కారు నడుపుతున్న మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండగా.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ప్రతీక్ష కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రతీక్ష మృతదేహాన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం లేదా సోమవారాల్లో ప్రతీక్ష మృతదేహాన్ని హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఇక, హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ప్రతీక్ష కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నారు. సాధ్యమైన సహాయం అందజేస్తున్నారు.