హైదరాబాదీ కళాకారిణికి బ్రిటన్ అపూర్వ పురస్కారం
ఈ యేడాది బ్రిటిన్ లో మొత్తం 26 మంది బీసీఏ అవార్డుకు ఎంపికయ్యారు. అయితే, ఈ పురస్కారం అందుకున్న తొలి తెలుగు మహిళ రాగసుధ కావడం విశేషం. తనకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు రావడం మీద రాగసుధ హర్హం వ్యక్తం చేశారు. తనకు విద్యనేర్పిన గురువులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
నృత్యంలో విశేష కృషి చేసిన తెలుగు కళాకారిణి రాగసుధా వింజమూరి(Ragasudha Vinjamuri)ని బ్రిటన్ ప్రభుత్వం బ్రిటిష్ సిటిజన్ అవార్డు(British Citizen Award) (BCA)తో సత్కరించింది. బ్రిటన్ పార్లమెంటులోని పెద్దల సభలో అవార్డు ప్రదాన కార్యక్రమం జరిగింది. విద్య, వైద్యం, సేవాకార్యక్రమాలు, పారిశ్రామిక, కళారంగాల్లో విశేష కృషి చేసిన వారికి బ్రిటన్ ప్రభుత్వం ప్రతి ఏటా బీసీఏ మెడల్స్ తో సత్కరిస్తుంది.
హైదరాబాద్: గూగుల్ సిగ్నల్ వద్ద బైక్‌పై దూసుకెళ్లిన కారు ... యువతి మృతి
ఈ యేడాది బ్రిటిన్ లో మొత్తం 26 మంది బీసీఏ అవార్డుకు ఎంపికయ్యారు. అయితే, ఈ పురస్కారం అందుకున్న తొలి తెలుగు మహిళ రాగసుధ కావడం విశేషం. తనకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు రావడం మీద రాగసుధ హర్హం వ్యక్తం చేశారు. తనకు విద్యనేర్పిన గురువులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
వివిధ సామాజిక, కళాత్మక, పర్యావరణ అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నృత్యం ఓ ప్రభావశీలమైన విధానమని ఈ సందర్బంగా ఆమె వ్యాఖ్యానించారు.