కెనడాలో వెడ్డింగ్ రిసెప్షన్‌లో పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ పై కాల్పులు, మృతి...
సామ్రా, రవీందర్ అనే ఇద్దరు అన్నాదమ్ములైన గ్యాంగ్ స్టర్లు కెనడాలోని ఓ పెళ్లి రిసెప్షన్ కు హాజరయ్యారు. అందులో ఒకరిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. వీరు యూఎన్ గ్యాంగ్‌తో కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం.
ఒట్టావా : కెనడాలోని వాంకోవర్ నగరంలో ఓ వివాహ వేదిక దగ్గర ఓ గ్యాంగ్ స్టర్ హతమయ్యాడు. అతడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మృతుడైన గ్యాంగ్ స్టర్ తో పాటు.. అతని అన్న కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. అన్నాదమ్ములైన ఈ గ్యాంగ్ స్టర్లిద్దరూ కెనడా పోలీసుల మోస్ట్ వాయిలెంట్ గ్యాంగ్‌స్టర్ల లిస్టులో ఉన్నారు.
స్థానిక వార్తాపత్రిక వాంకోవర్ సన్‌లోని వార్తల ప్రకారం, అమర్‌ప్రీత్ (చుక్కీ) సమ్రా.. అనే గ్యాంగ్ స్టర్ తనమీద కాల్పులు జరగడానికి అరగంట ముందే.. ఫ్రేజర్‌వ్యూ బాంక్వెట్ హాల్‌లోని డ్యాన్స్ ఫ్లోర్‌లో మిగతా అతిథులతో పాటు డ్యాన్స్ చేశారు. అతడిని ఫ్రేజర్ స్ట్రీట్‌లో తెల్లవారుజామున 1:30 గంటల మధ్య కాల్చి చంపారు.
సామ్రా, అతని అన్నయ్య, గ్యాంగ్‌స్టర్ అయిన రవీందర్ ఇద్దరూ ఆ పెళ్లికి అతిథులుగా ఆహ్వానించబడ్డారు. వారు యూఎన్ గ్యాంగ్‌తో కలిసి పనిచేస్తున్నారు. దీనిమీద కొంతమంది అతిథులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. డ్యాన్స్ చేస్తున్న సమయంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు హాల్‌లోకి ప్రవేశించారు.. సంగీతాన్ని ఆపమని డీజే వ్యక్తికి చెప్పారు. ఆ సమయంలో దాదాపు 60 మంది అతిథులు వేదిక వద్ద ఉన్నారు.
న్యూ మెక్సికోలో బైకర్ ల మధ్య కాల్పులు.. ముగ్గురు మృతి.. ఐదుగురికి గాయాలు
వాంకోవర్ పోలీసుల నుండి అధికారిక ప్రకటనలో, వారు ఈ ఉదయం కాల్చి చంపబడిన 28 ఏళ్ల వ్యక్తి హత్యపై దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. "1:30 గంటలకు ఫ్రేజర్ స్ట్రీట్, సౌత్ ఈస్ట్ మెరైన్ డ్రైవ్ సమీపంలోని సౌత్ వాంకోవర్ బాంకెట్ హాల్ వెలుపల ఒక వ్యక్తి కాల్చి చంపబడ్డాడని 911కి కాల్స్ అనేక కాల్స్ వచ్చాయి. పారామెడిక్స్ వచ్చే వరకు పెట్రోలింగ్ అధికారులు బాధితుడికి సీపీఆర్ చేశారు, కానీ అతను తీవ్ర గాయాలతో మరణించాడు" అని ప్రకటనలో తెలిపారు.
ముఠా కక్షల నేపథ్యంలోనే ఈ కాల్పులు జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిమీద దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం ఇవ్వగలిగేవారెవ్వరైనా వాంకోవర్ పోలీస్ హోమిసైడ్ యూనిట్‌కు 604-717-2500కి కాల్ చేయవలసిందిగా పోలీసులు కోరుతున్నారు.
ఆగస్ట్ 2022లో, కెనడియన్ పోలీసులు 11 మంది వ్యక్తులపై తీవ్ర స్థాయిలో ముఠా హింసకు పాల్పడుతున్నట్లుగా హెచ్చరిక జారీ చేశారు. వీరికి దగ్గర్లో ప్రజలు ఉండకూడదని పోలీసులు హెచ్చరించారు. హెచ్చరికలో పేర్కొన్న 11 మందిలో అమర్‌ప్రీత్, అతని సోదరుడు రవీందర్‌తో సహా తొమ్మిది మంది పంజాబ్‌కు చెందినవారున్నారు. బ్రిటిష్ కొలంబియా పోలీసులు ప్రావిన్స్‌లో జరిగిన హత్యలు, కాల్పులతో వీరికి సంబంధం ఉందని తెలిపారు.