Asianet News TeluguAsianet News Telugu

ఖైదీ కి ‘సెక్స్ స్లేవ్’ గా ప‌ని చేయాల్సి వ‌చ్చింది - సంచలన ఆరోప‌ణ‌లు చేసిన ఇజ్రాయెలీ మ‌హిళా మాజీ గార్డ్

ఇజ్రాయిల్ లో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఖైదీ వద్ద తాను సెక్స్ స్లేవ్ గా పని చేయాల్సి వచ్చిందని, ఉన్నతాధికారులు తనను అలా చేయాలని ఒత్తిడి చేశారని ఓ మాజీ మహిళా గార్డ్ ఆరోపించింది. అయితే దీనిపై ఆ దేశ ప్రధాని విచారణకు ఆదేశించారు. 

Palestinian prisoner forced to work as 'sex slave' - Israeli female guard makes sensational allegations
Author
Jerusalem, First Published Aug 1, 2022, 10:14 AM IST

ఇజ్రాయిల్ దేశానికి చెందిన ఓ మాజీ మ‌హిళా గార్డ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తాను జైలులో విధులు నిర్వ‌హిస్తున్నప్పుడు ఉన్న‌తాధికారుల బ‌ల‌వంతం వ‌ల్ల ఓ పాలస్తీనా ఖైదీ కి ‘సెక్స్ స్లేవ్‘ గా పని చేయాల్సి వచ్చిందని అన్నారు. దీని వల్ల ఆ ఖైదీ తనపై ప‌దే ప‌దే అత్యాచారానికి పాల్ప‌డ్డాడ‌ని ఆమె అన్నారు. గ‌త వారం త‌న‌ను మాజీ గిల్బోవా గార్డ్‌గా చెబుతూ పేరు వెల్ల‌డించ‌కుండా ఓ మ‌హిళా ఆన్ లైన్ ద్వారా ఈ ఫిర్యాదును చేశారు. ఈ ఆరోప‌ణ‌ల‌పై ఇజ్రాయిల్ ప్ర‌ధాని స్పందించారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించారు. 

floods: అమెరికాలో వ‌ర్ష బీభత్సం.. కెంట‌కీలో 26 మంది మృతి..

గిల్బోవా జైలులో ఉండే ఖైదీలు మ‌హిళా గార్డుల‌ను దుర్భాషలాడుతుంటార‌ని చాలా సంవత్సరాలుగా ఇజ్రాయెల్ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అయితే గ‌తేడాది అక్క‌డి జైలు అస్త‌వ్య‌స్థ‌మైన నిర్వ‌హ‌ణ ఒక్క సారిగా వెలుగులోకి వ‌చ్చింది. ఆరుగురు పాలస్తీనా ఖైదీలు గిల్బోవా నుండి డ్రైనేజీ ల సొరంగం ద్వారా జైలు నుంచి బ‌య‌టప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ప్ర‌పంచంలో ఒక్క సారిగా హాట్ టాపిక్ గా మారింది. గిల్బోవాలో ‘‘పింపింగ్ ఎఫైర్ (లైంగిక అవసరాల కోసం మ‌హిళ‌ను ఒక‌రికి అప్ప‌గించ‌డం) ’’ అనే విషయాలు కొన‌సాగుతున్నాయ‌ని ఇజ్రాయెల్ మీడియా వ‌రుస‌గా వెల్ల‌డించింది. ఇత‌ర ఖైదీల‌తో దాడికి గురి అయ్యే ప‌రిస్థితులు ఉంటే  పురుష పర్యవేక్షకులు మహిళా గార్డుల‌ను అక్క‌డ విధుల‌కు కేటాయిస్తార‌ని ప‌లు నివేదిక‌లు వెల్ల‌డించాయి.

Viral News: స‌ర‌దాగా ముగిసిన‌ విహారయాత్ర‌.. ఇంటికెళ్లి బ్యాగ్ తెరిచి చూసి కంగుతున్న మ‌హిళ‌..

త‌నను ఇలా సెక్స్ స్లేవ్ గా ఉప‌యోగించార‌ని ఓ మాజీ గిల్బోవా గార్డ్ గత వారం ఆన్ లైన్ వేధికగా ఫిర్యాదు చేశారు. ఆమె ఉన్నతాధికారుల‌తో ఓ ఖైదీకి అప్పగించబడింది. అత‌డికి ప్రైవేట్ సెక్స్ బానిస అయ్యింది. ‘‘ నేను అత్యాచారానికి గురికావాలని కోరుకోలేదు. కానీ నాపై పదే పదే లైంగిక దాడి జరిగింది ’’ అని ఆమె వెల్లడించారు. ఆ మ‌హిళ త‌రుఫున ఓ న్యాయవాది స్పందిస్తూ ఇజ్రాయెల్ కు చెందిన ఛానల్ 12లో ఆమె ఫిర్యాదును ధృవీకరించారు. పరీక్ష తర్వాత తన క్లయింట్‌కు మానసిక ఆరోగ్య మద్దతు అవసరమని చెప్పారు.

ఈ పరిణామాలపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి యైర్ లాపిడ్ ఆదివారం తన క్యాబినెట్‌తో ఇలా అన్నారు. ‘‘ ఒక గార్డ్ తన విధి నిర్వహణలో ఉన్న‌ప్పుడు ఓ ఖైదీ చేతిలో అత్యాచారానికి గురికావాన్ని స‌హించ‌లేము’’ అని తెలిపారు. ‘‘ దీనిపై తప్పకుండా దర్యాప్తు చేయిస్తాం. ఆ సోల్జర్ కు సహాయం అందుతుందని మేము నిర్ధారించుకుంటాము’’ అని పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన అంశాలు గ్యాగ్ ఆర్డర్‌లో ఉన్నాయని అన్నారు. ఇలాంటి సంఘటన మళ్లీ జరగకుండా చూసేందుకు తాను ఇజ్రాయెల్ ప్రిజన్ సర్వీస్ (IPS) కమిషనర్ కేటీ పెర్రీతో చర్చలు జరుపుతున్నానని అన్నారు. 

ఆహారంలో బొద్దింకలు.. పాకిస్తాన్‌లో పార్లమెంట్ క్యాంటీన్‌కు సీల్

ఆదివారం అంతర్గత భద్రతా మంత్రి ఒమర్ బార్లెవ్ ఒక ప్రత్యేక ప్రకటనలో ‘‘ కొన్ని సంవత్సరాల క్రితం గిల్బోవా జైలులో జరిగిన వ్యవహారం ఇజ్రాయెల్ ప్రజలను కదిలించింది. నేను ప్రచురించబడిన సాక్ష్యాలను చదివాను. నేను ఆశ్చర్యపోయాను ’’ అని అన్నారు. కాగా.. ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడినందుకు అనేక మంది పాలస్తీనియన్లను ఉత్తర ఇజ్రాయెల్‌లోని గిల్బోవా జైలులో అక్కడి ప్రభుత్వం ఉంచింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios