Asianet News TeluguAsianet News Telugu

కువైట్ లో కారు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తెలుగువారు మృతి...

కువైట్ లో జరిగిన ఓ కారుప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతుల్లో భార్యాభర్త, ఇద్దరు పిల్లలున్నారు. 

Car accident in Kuwait, Four Telugus from same family died  - bsb
Author
First Published Aug 26, 2023, 7:27 AM IST | Last Updated Aug 26, 2023, 7:27 AM IST

అన్నమయ్య జిల్లా : కువైట్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి కు చెందిన ఓ కుటుంబం మృత్యువాత పడింది. కువైట్ లో జరిగిన రోడ్డు ప్రమాదం నలుగురిని బలి తీసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన వారవడంతో  వారి స్వస్థలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే..  మృతుడు గౌస్ బాషా (35), అతని భార్య (30)..  ఇద్దరు కొడుకులు ఈ ప్రమాదంలో మరణించారు. గౌస్ బాషా అన్నమయ్య జిల్లాలోని రాజంపేట పట్టణంలోని ఎగువగడ్డ లో ఉన్న అవ్వ తాతల దగ్గర ఉంటూ స్థానిక పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తరువాత స్వగ్రామమైన మదనపల్లెకి వెళ్ళాడు.  

బాలుడిని డాబా మీదినుంచి తోసేసిన వాలంటీర్.. కాలు, చెయ్యి విరిగి..తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరి...

అక్కడి నుంచి బెంగళూరు వెళ్లి… వివాహం చేసుకొని సెటిల్ అయ్యాడు. కొంతకాలానికి బెంగళూరు నుంచి కువైట్ కి వెళ్ళాడు. భార్య పిల్లలను కూడా తనతో పాటు తీసుకువెళ్లాడు. అక్కడ కారులో వెడుతుండగా ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బోల్తా పడింది.  ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు, గౌస్ బాషా మృతి చెందారు. 

దీనిమీద గౌస్ బాషా సమీప బంధువులు మాట్లాడుతూ.. వారి మృతి విషయంలో అనుమానాలున్నాయన్నారు. రోడ్డు ప్రమాదం మాత్రం వాస్తవమేనని చెప్పారు. మృతి చెందినట్లు చెబుతున్న వ్యక్తికి ఫోన్ చేస్తే... అతను అందుబాటులోకి రావడం లేదు. దీంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. వారి మృతదేహాలను చూసేవరకు ఏమీ చెప్పలేమని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios