హెచ్ 1బీ వీసాదారులకు ఊరట: ట్రంప్ సర్కార్ ఆదేశాలకు అమెరికా కోర్టు బ్రేక్
హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు కల్పించిన పని అనుమతులను రద్దు చేయాలన్న ట్రంప్ ప్రభుత్వ ఆదేశాలకు కోర్ట్ తాత్కాలికంగా బ్రేక్ వేసింది.
అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయ హెచ్1 బీ వీసాదారులకు అమెరికన్ న్యాయస్థానం ఊరటను కలిగిస్తూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే తీర్పునిచ్చింది. హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు కల్పించిన పని అనుమతులను రద్దు చేయాలన్న ట్రంప్ ప్రభుత్వ ఆదేశాలకు కోర్ట్ తాత్కాలికంగా బ్రేక్ వేసింది.
ట్రంప్ సర్కార్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించడంతోపాటు, పున:పరిశీలించాలని యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్ దిగువ కోర్టును సూచించింది. న్యాయస్థానం ఈ అప్పీల్ కోర్టు ఆదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఒక నిర్ణయానికి రావాలని తెలిపింది.
Also read: ఇండియన్స్ కి ట్రంప్ షాక్ : ఐటీ మేజర్లపై....
అప్పటి వరకు తుది తీర్పు వెల్లడిపై కూడా స్టే విధిస్తూ , అప్పటివరకు తీర్పును నిలిపివేయాలని ఆదేశించింది. ఇక అమెరికన్ కంపెనీలు నిపుణులైన విదేశీయులను తాత్కాలికంగా ఉద్యోగంలో చేర్చుకోవడానికి హెచ్1 బీ వీసాలు కీలకం. వీటికి దరఖాస్తు చేసుకుంటున్న వారిలో భారతీయులే అధికం. వారిలోనూ, ఐటీ నిపుణులే ఎక్కువగా ఉంటున్నారు.
ఇదిలా ఉండగా, 2015లో ఒబామా ప్రభుత్వం హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు కూడా పని చేసుకోవడానికి అనుమతులు కల్పించాలని నిర్ణయిస్తూ హెచ్-4 వీసా విధానాన్ని తీసుకొచ్చింది. అయితే, ఇలా హెచ్ 1బీ వీసాదారుల భాగస్వాములకు కూడా పని అనుమతులు కల్పించడం వల్ల చాలా మంది అమెరికన్లు నష్టపోతున్నారని ట్రంప్ సర్కార్ భావించింది. ఈ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది.
Also read: హెచ్ 1బీ రూల్స్ సడలించండి: ట్రంప్‌కు 60 వర్సిటీల లేఖ.. నిపుణుల కొరత వస్తుందని ఆందోళన
దీనిపై స్పందించిన యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్ ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేయాలని తీర్పునిచ్చింది. హెచ్-4 వీసా విధానం వల్ల అధిక ప్రయోజనం పొందుతున్నది భారతీయులే. ప్రత్యేకించి మహిళలు ఈ విధానం వల్ల అత్యధికంగా లాభం పొందుతున్నారు.
ఇలా భారతీయులే తమ ఉద్యోగాలకు గండి కొడుతున్నారని భావించిన అనేక మంది యూఎస్ కార్మికులు దీనిని సవాలు చేశారు. ఈ విధానం వల్ల స్థానికులకు ఉపాధి లభించడం లేదని, వెంటనే దీన్ని రద్దు చేయాలని ట్రంప్ సర్కార్ ని డిమాండ్ చేశారు.
ఈ తీవ్రమైన ఒత్తిడి వల్ల, ట్రంప్ స్వతహాగా ఎప్పటినుండో కూడా అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అనే నినాదాన్ని ఎత్తుకొని ముందుకు పోతుండడంతో, ట్రంప్ ప్రభుత్వం హెచ్-4 వీసా విధానాన్ని రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. తాజాగా కోర్టు నిర్ణయంతో భారతీయులకు, స్పెషల్ గా మహిళలకు ఈ ఆదేశాలు ఒకింత మాత్రం మాత్రం ఊరటనిచ్చాయ.