ఛీ.. చదువుకోవడానికి వెళ్లి పాడుపని.. బ్రిటన్ లో కేరళ విద్యార్థి అరెస్ట్...
చదువుకోసం యూకేకి వెళ్లి పాడుపనికి దిగజారాడో యువకుడు.. అక్కడి పోలీసులు పన్నిన వలలో చిక్కుకుని ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. చివరికి దోషిగా ఇండియా చేరుకోనున్నాడు. ఇంతకీ అతనేం చేశాడంటే...
బ్రిటన్ : ఉన్నత విద్యకోసం britan కు వెళ్లిన ఓ విద్యార్థి స్వయంకృతాపరాధంతో ఓ కేసులో ఇరుక్కున్నాడు. అక్కడ చదువుతున్న భారత సంతతికి చెందిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. Child molestationకు సంబంధించిన కేసులో శనివారం కేరళకు చెందిన విద్యార్థిని అరెస్టు చేసినట్లు యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) పోలీసులు తెలిపారు. kerala లోని కొట్టాయం జిల్లా రామాపురం ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యువకుడు బ్రిటన్ బాలల సంరక్షణ బృందం జరిపిన Sting operation లో పట్టుబడ్డాడు.
నివేదికల ప్రకారం.. చదువుకోసం వెళ్లిన ఆ వ్యక్తి ఆ పనిలో ఉండక... sex కోసం సోషల్ మీడియాలో సెర్చ్ చేశాడు. ఈ క్రమంలో పరిచయమైన 14 ఏళ్ల మైనర్ బాలికను సంప్రదించాడు. కాగా, Social mediaలో యువతులపై ఆరా తీస్తున్న వారిని పట్టుకోవడం బాలల సంరక్షణ బృందం రూపొందించిన Profile గురించి అతనికి తెలియదు. ఈ క్రమంలో ఓ బాలికను ప్రలోభ పెట్టిన తరువాత ఆ యువకుడు లండన్ లోని ఓ హోటల్ కు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు.
అతను లూటన్ లోని తన ఇంటి నుంచి దాదాపు గంటసేపు ప్రయాణించి, ఆ అమ్మాయి బస చేసిన హేమెల్ హెంప్ స్టెడ్ కు చేరుకున్నాడు. అయితే.. అప్పటికే అతడిని ట్రేస్ చేసిన బాలల సంరక్షణ బృందం, పోలీసులు అక్కడికి చేరుకుని నిఘా వేసి పట్టుకున్నారు. చదువుకుంటూ.. కేర్ టేకర్ గా పనిచేస్తున్న యువకుడు ఈ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
ఇది తెలిసి ముందు అతను తప్పించుకోవడానికి ప్రయత్నించాడని.. చివరకు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూ. 15 లక్షలు వెచ్చించి యూకేలో చదువుకునేందుకు వచ్చానని.. అనుకోకుండా పొరపాటు జరిగిందని యువకుడు పోలీసులకు తెలియజేశాడు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత అతనిని స్వదేశానికి పంపించనున్నారు. అయితే, బాలల సంరక్షణ బృందం సృష్టించిన మరో రెండు ప్రొఫైల్ లలో కూడా అతను చాట్ చేస్తున్నాడని అధికారుల బృందం తెలిపింది.