రెండు ట్రైనీ విమానాలు ఢీకొని ఒక భారతీయ యువతి సహా.. ముగ్గురు మృతి చెందిన సంఘటన వాషింగ్టన్ లో చోటుచేసుకుంది. మియామి సమీపంలో శిక్షణకు ఉపయోగించే రెండు చిన్న విమానాలు అనుకోకుండా ఒకదానిని మరొకటి ఢొకొన్నాయి. దీంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.

ఈ రెండు విమానాలు మియామిలోని డీన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ స్కూలుకి చెందినవిగా గుర్తించారు. ఈ స్కూల్ కి చెందిన విమానాలు కేవలం 10ఏళ్లలో రెండు డజన్లకు పైగా ప్రమాదానికి గురైనట్లు అధికారులు పేర్కొన్నారు. 

మృతులు నిషా సెజ్వాల్(19 సంవత్సరాలు, ఇండియా), జార్గే షాంచెజ్(22), రాల్ఫ్ నైట్(72) గా గుర్తించారు.  నిషా.. 2017లో ఈ ఫ్లైట్ స్కూల్ లో శిక్షణ నిమిత్తం చేరింది. ఆమె ఫేస్ బుక్ ఆధారంగా ఈ విషయాలు తెలుసుకున్నట్లు వారు తెలిపారు.