హైదరాబాద్: చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ యుహో మొబైల్స్ తెలుగు రాష్ట్రాల విపణిలోకి ప్రవేశించింది. కొత్త స్మార్ట్‌ఫోన్ వినియోగదారులే లక్ష్యంగా మొత్తం ఆరు మోడళ్లలో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. 

రూ. 6000-రూ. 9,500 ధరల శ్రేణిలో ఈ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు యుహో మొబైల్స్ సేల్స్ డైరెక్టర్ కేశవ్ అరోరా తెలిపారు. బుధవారం నగరంలో జరిగిన కార్యక్రమంలో యుహో వాస్ట్ ప్లస్ ఫోన్‌ను టాలీవుడ్ హీరోయిన్ సిమ్రాన్ చౌదరితో కలిసి విడుదల చేశారు.

దేశీయంగా ఫోన్ల ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం 2021 నాటికి రూ.500 కోట్ల మేరకు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నెలకు 15,000 మొబైళ్ల అమ్మకాలే లక్ష్యంగా సాగుతామని తెలిపారు. తాము 2017లో భారత మార్కెంట్లోకి ప్రవేశించిన నాటి నుంచి యుహో మొబైల్స్‌కు వినియోగదారుల మంచి స్పందన వస్తోందని కేశవ అరోరా తెలిపారు. హైదరాబాద్ తమకు చాలా ముఖ్యమైన మార్కెట్ అని ఆయన తెలిపారు.