శామ్సంగ్‌కు ధీటుగా జియోమీ దూకుడు: 3 నెలల్లో 2.75 కోట్ల సేల్స్
స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో చైనా దిగ్గజం జియోమీ తనకు ఉన్న పట్టును కాపాడుకుంటూ ముందుకు సాగుతోంది.
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ జియోమీ భారత స్మార్ట్‌ఫోన్ విపణిలో దూసుకుపోతోంది. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం శామ్‌సంగ్‌కు ధీటుగా విక్రయాలను జియోమీ జరుపుకొంటున్నది.
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 2.75కోట్ల స్మార్ట్‌ఫోన్లను విపణిలోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ‘2019 తొలి మూడు నెలల్లో 27.5మిలియన్‌లకు పైగా స్మార్ట్‌ఫోన్లను విపణిలోకి తీసుకొచ్చాం’ అని జియోమీ ఛైర్మన్ లియాజన్ తెలిపారు.
కాగా, ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ మాత్రం షియోమీ 25మిలియన్ల స్మార్ట్‌ఫోన్లను మాత్రమే విపణిలోకి తీసుకొచ్చిందని తన నివేదికలో తెలిపింది.ఆసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే, కేవలం భారత్‌లో మాత్రమే షియోమీ ఫోన్ల షిప్‌మెంట్ పెరిగిందని పేర్కొంది. దీనిపై షియోమీ ఛైర్మన్ మండిపడ్డారు. ఆ వార్తలన్నీ అవాస్తవమని తెలిపారు.
స్టార్టప్‌ల ‘ఐటీ’ నిబంధనలు సరళం
స్టార్టప్‌లు నిధులు సమీకరించుకోవడాన్ని సులభం చేసేందుకు నివాస గృహాల విక్రయం, నష్టాలను ముందు ఏడాదికి బదిలీ చేసుకోవడం వంటి వెసులుబాట్లు కల్పిస్తూ ఆదాయపు పన్ను నిబంధనలు సడలించాలని పారిశ్రామిక ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య శాఖ ప్రతిపాదించింది.
‘స్టార్టప్ ఇండియా విజన్ 2024’లో భాగంగా ఈ ప్రతిపాదన చేసింది. కేంద్రంలో కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి తీసుకోవలసిన చర్యలపై ఈ పత్రం సిద్ధం చేసింది.
స్టార్టప్‌లకు నియంత్రణాపరమైన నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించడం కోసం ఆదాయం పన్ను సెక్షన్ 54బి (కొన్ని కేసుల్లో నివాస గృహాల బదిలీపై పెట్టుబడి లాభాల పన్ను మినహాయింపు), సెక్షన్ 79 (కొన్ని కంపెనీలు నష్టాలను క్యారీ ఫార్వర్డ్ లేదా సెటాఫ్ చేసుకునే సదుపాయం) రెండింటిలోనూ అవసరమైన సవరణలు చేయాలని సిఫారసు చేసింది.