ముంబై : మీరు ఖరీదైన ఐఫోన్‌ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారా? అందుకు మంచి అవకాశం. డిజిటల్‌ దిగ్గజం పేటీఎం మాల్ భారీ డిస్కౌంట్ సేల్‌కి తెరలేపింది. త‌న వెబ్‌సైట్‌లో ఐఫోన్ల‌పై ఆక‌ట్టుకునే క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ల‌ు అందిస్తోంది. ఐఫోన్‌ ‘ఎక్స్‌ఈ’ మొదలు ‘ఎక్స్‌ఎస్‌’ మ్యాక్స్‌ వరకు ఈ ఆఫర్‌ను ప్రకటించింది. 

ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుల‌ను ఉప‌యోగించి ఫోన్ల‌ను కొనుగోలు చేస్తే అద‌నంగా మ‌రో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను  ఆఫర్‌ చేస్తోంది. ఈ ఆఫ‌ర్ ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. 

ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌ మ్యాక్స్‌, ఐఫోన్ ఎక్స్‌ఎస్‌, ఐఫోన్ ఎక్స్‌ఆర్‌ త‌దితర ఫోన్ల‌పై గ‌రిష్టంగా రూ.15వేల వ‌ర‌కు క్యాష్‌బ్యాక్‌ను  వినియోగదారులకు అందిస్తోంది. దీంతోపాటు కొన్ని మోడల్స్‌పై  ప్రోమోకోడ్‌ ఆఫర్‌ కూడా ఉంది.

256  జీబీ స్టోరేజి వేరియంట్‌ సామర్థ్యం గల ఐఫోన్ ఎక్స్ మాక్స్ ఫోన్‌ను రూ. 1,14,156 లకే కొనొచ్చు. ఐ ఫోన్‌ ఎక్స్‌ఆర్‌ 64 జీబీ మోడల్‌ ఫోన్ రూ. 53,687లకే అందుబాటులో  ఉంది.

64జీబీ, 256  జీబీ స్టోరేజ్‌ వేరియింట్‌ ఐఫోన్ ఎక్స్‌ ఫోన్ ధరలు  వరుసగా  రూ. 89,999 రూ. 75,489గా ఉన్నాయి. దీంతోపాటు ఎకోడాట్ స్మార్ట్ స్పీకర్ కూడా ఉచితంగా లభిస్తుంది.

64జీబీ స్టోరేజ్‌ వేరియింట్‌ ఐఫోన్ 8 ఫోన్ రూ. 59,990లకు,  256 జీబీ స్టోరేజ్‌ సామర్థ్యం గల ఐఫోన్ 8 ధర  రూ. 70,799లకు లభిస్తుంది. ఐఫోన్ 8 ప్లస్ 64జీబీ స్టోరేజ్‌ వేరియింట్‌ ధర రూ. 68వేలకు అందుబాటులో ఉంది. 

32 జీబీ వేరియంట్‌ ఐఫోన్ 7 ధర రూ. 39,530కు అందుబాటులో ఉండగా 128జీబీ స్టోరేజి మోడల్‌ ఫోన్ ధర రూ.  52,999గా నిర్ణయించారు. 32జీబీ వేరియంట్ ఐఫోన్ 7 ప్లస్ ధర రూ.49,899, 128జీబీ వేరియంట్ ఐఫోన్ 7 ప్లస్ ధర రూ.61.999, 256 జీబీ స్టోరేజ్‌ ఫోన్ ధర రూ. 64,990లకు లభిస్తుంది.