59 కంప్యూటర్ల ధ్వంసం: అమెరికాలో భారత విద్యార్థికి 10ఏళ్ల జైలు

యూఎస్‌బీ కిల్లర్ అనే థంబ్ డ్రైవ్‌ను ఉపయోగించి న్యూయార్క్‌లోని ఓ కాలేజీలో 59 కంప్యూటర్లు ధ్వంసం చేశాడు భారత విద్యార్థి. ఈ మేరకు తన నేరాన్ని కూడా అంగీకరించాడు. అతడు ఉపయోగించిన డ్రైవ్ అమెజాన్‌లో లభిస్తుండటం గమనార్హం.

Indian Pleads Guilty of Destroying 59 University Computers Using   USB Killer Thumb Drive: Report

న్యూయార్క్: యూఎస్‌బీ కిల్లర్ అనే థంబ్ డ్రైవ్‌ను ఉపయోగించి న్యూయార్క్‌లోని ఓ కాలేజీలో 59 కంప్యూటర్లు ధ్వంసం చేశాడు భారత విద్యార్థి. ఈ మేరకు తన నేరాన్ని కూడా అంగీకరించాడు. అతడు ఉపయోగించిన డ్రైవ్ అమెజాన్‌లో లభిస్తుండటం గమనార్హం.

వెపనైజ్డ్ అయిన ఆ డ్రైవ్‌ను ఉపయోగించిన 27ఏళ్ల భారత విద్యార్థి విశ్వనాథ్ ఆకుతోట కాలేజీలోని  $51,109, (సుమారు రూ. 35,46,700) విలువ చేసే 59 కంప్యూటర్లను ధ్వంసం చేశాడు. దీంతో మళ్లీ ఆ కంప్యూటర్లను తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు ఉద్యోగులు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. ఇందుకు  $7,362 (సుమారు రూ. 5,10,900) ఖర్చు కూడా చేశారు. 

అయితే, తన తప్పును ఒప్పుకున్న విశ్వనాథ్.. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు అంగీకరించాడు. కాగా, ఈ కేసును విచారించిన కోర్టు అతనికి 10ఏళ్ల జైలు శిక్షను విధించింది. అంతేగాక, అతనికి $250,000 (సుమారు రూ. 17,349,100) జరిమానాను కూడా విధించింది. 

జైలు నుంచి విడుదలయ్యాక మూడేళ్లపాటు పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 14న జరిగిన ఘటనకు తాజాగా కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. విశ్వనాథ్ తానే కంప్యూటర్లను ధ్వంసం చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే, ఎందుకు ఇలా చేశాడో మాత్రం స్పష్టం చేయలేదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios