న్యూఢిల్లీ: భారతదేశంలోని మెజార్టీ ఐటీ కంపెనీలు లాభాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ సంస్థలన్నీ ఉద్యోగాల కోసం ఎదురుచూసే టెక్కీలకు శుభవార్తను తెలిపాయి.

గత కొంత కాలంగా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న ఐటీ కంపెనీలు ఇటీవల కాలంలోనే లాభాల బాట పట్టాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి ఐటీ సంస్థలు గత సంవత్సరంలోనే వేలాది మందికి ఉద్యోగాలను కల్పించాయి.

కాగా, అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే 300శాతం ఎక్కువగా ఉద్యోగావకాశాలను కల్పించడం గమనార్హం. ఇలా టీసీఎస్, ఇన్ఫోసిస్ టెక్ సంస్థలు భారత ఐటీ రంగానికి తీపికబురునందించాయి. భవిష్యత్‌లో ఇదే దోరణి కొనసాగే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

మార్చి 31, 2019తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కొత్తగా 29,287మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంది. దీంతో టీసీఎస్ ప్రస్తుతం మొత్తం 4.24మంది ఉద్యోగులను కలిగివుంది.

ఇక బెంగళూరు ప్రధాన కేంద్రం కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 24,016 మంది ఉద్యోగులను కొత్తగా తీసుకుందని ఫార్చూన్ వెల్లడించింది. దీంతో ఇన్ఫోసిస్‌లో పనిచేసే వారి సంఖ్య 2.28లక్షలకు చేరుకుంది. 

2017-18 సంవత్సరంలో ఈ రెండు సంస్థలు కలిసి 11,000 మంది ప్రొఫెషనల్స్‌ను నియమించుకున్నాయి. టీసీఎస్ 7,775 ఉద్యోగులను, ఇన్ఫోస్ 3,743 ఉద్యోగులను నియమించుకున్నాయి. ప్రత్యేక నైపుణ్య కలిగిన టెక్కీలను మాత్రమే ఈ సంస్థలు నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తున్నాయి. 

కొత్తగా కంపెనీలో చేరే వారి(ఎంట్రీ లెవల్) నైపుణ్యం పెంచుందుకు ఈ భారతీయ దిగ్గజ సంస్థలు వారికి శిక్షణ ఇస్తున్నాయి. 2019లో 12.5శాతం రిక్రూట్‌మెంట్ సంఖ్యను పెంచేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్(ఏఐ), బ్లాక్‌చైన్, అనాలటిక్స్, బోత్  డేటా మింగ్ అనే దానిపై ప్రత్యేక అవగాహన ఉన్నవారికి ఈ అవకాశాలు వస్తున్నాయి. 2018-19 మధ్య కాలంలో రిక్రూట్‌మెంట్ అంశంపై ప్రజల నుంచి భిన్న స్పందన ఎదురైంది.