సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరోసారి విమర్శలకు తావిచ్చింది. ఇప్పటికే డేటా స్కాం మరకతో మరకలంటించుకున్న ఫేస్‌బుక్.. తాజాగా మరోసారి అలాంటి పనే చేసింది. ఏకంగా సుమారు 1.5 మిలియన్ యూజర్ల ఈ-మెయిల్ కాంట్రాక్టుల సమాచారాన్ని వారికి తెలియకుండానే ఫేస్‌బుక్ దొంగిలించిందనే వార్తలు వచ్చాయి. 

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఫేస్‌బుక్ తమ యూజర్లను కొత్తగా ఈమెయిల్ పాస్‌వర్డ్ వెరిఫై చేసుకోమని అడుగుతోందట. అకౌంట్ లాగిన్ సమయంలో ఈ వెరిఫై వస్తుందట. ఆ పాపప్ మెసేజ్‌లో యూజర్లు పాస్‌వర్డ్ ఎంటర్ చేసే సమయంలోనే వారి పర్మిషన్ లేకుండానే ఈ మెయిల్/ఫోన్ కాంటాక్ట్స్‌ని ఇంపోర్ట్ చేసుకుంటుందని సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు.

అయితే, తాము ఉద్దేశపూర్వకంగా ఆ పని చేయలేదని, అనుకోకుండా అలా జరిగిందని ఫేస్‌బుక్ యాజమాన్యం చెప్పుకురావడం గమనార్హం. కాంటాక్ట్స్ సమాచారాన్ని సేకరించడం ద్వారా ఎటువంటి అక్రమాలకు పాల్పడం లేదని, సోషల్ మీడియాలో మరింతగా నెట్‌వర్క్ విస్తరించుకోవడంలో భాగంగానే ఇది జరిగిందని ఫేస్‌బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. యూజర్లకు గైడెన్స్ ఇవ్వడానికే ఇలా చేశామని చెప్పారు.

గత నెల నుంచే ఫేస్‌‌బుక్ ఈమెయిల్ పాస్‌వర్డ్ వెరిఫికేషన్‌ను ఆపేశామని, లాగిన్ అయిన తొలిసారి మాత్రమే ఈ వెరిఫికేషన్ అడుగుతున్నామని వెల్లడించారు. ఫేక్ అకౌంట్లు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకోకతప్పలేదని చెప్పారు.

వెరిఫికేషన్ విధానాన్ని ఆపేశామని యూజర్లు దీనిపై రివ్యూ కూడా చేసుకోవచ్చని తెలిపారు. ఈ కాంట్రాక్ట్స్‌ని వేరేవారికి బదిలీ చేయడం లేదని, వారికి సోషల్ మీడియాలో మరింతగా నెట్‌వర్క్ పెంచుకునేందుకు మాత్రమే తీసుకున్నామని చెప్పారు. సెట్టింగ్ మెనూలోకి వెళ్లి వారే ఈ కాంటాక్ట్స్ షేర్ ఆప్షన్ రివ్యూ చేసుకోవచ్చని పేర్కొంది. ఇది ఇలా ఉండగా, ఇన్‌స్టా‌గ్రామ్ పాస్‌వర్డ్‌లు కూడా సేకరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చదవండి: ఏది బెటర్?: హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్