Asianet News TeluguAsianet News Telugu

సంగీత కళాప్రవీణ ఎన్ సి పార్థసారధికి నివాళి

ఈ రోజు చెన్నైలో ఎన్ సి పార్థసారధి శత జయంతి ఉత్సవం 

centenary of musician N C parthasarathy

 "ద్వారకాబాయి, ఎన్.సి. పార్థ సారథి సంగిత శాస్త్రములొ సహాధ్యాయులు. ఇరివురు కలిసి  కచేరిలలొ పాల్గొనెవారు. అనేక బహుమతులందుకున్నారు.  క్రమంగా స్నెేహం ప్రేమగా మారింది.  దరిమిలా వివాహము చెసుకొనుటకు నిశ్చయించుకొన్నారు. (ద్వారకా బాయి తండ్రి, గాడిచర్ల హరిసర్వోత్తమ) రావుగారు  వీరిని ఆశీర్వదించారు. 1942, మే 9 న మహాబలీపురం, తిరుక్కళి కుండపక్షితీర్థంవద్ద సంస్కరణ వివాహం జరిగింది.  పార్థసారథి, ద్వారకాగారు  1945 లొ గోపాలపురములొ "మద్రాస్ సంగీత కళాశాల"ను  స్థాపించి నిర్వహించారు. కర్ణాటక శాస్త్రీయ గాత్ర, వాద్య సంగీతాలలో ఎంతో  కృషి చెసారు. ఫ్రామాణిక సంగీత శాస్త్ర  గ్రంథాలు రచించారు"  (హరిసర్వోత్తమ జీవితం - మాదాల వీరభద్ర రావు. మొదటి ముద్రణ: 1965, రెండవ పరిష్కృత ముద్రణ; గాడిచర్ల ఫౌండేషన్: 2016 )

 

నల్లాన్ చక్రవర్తుల పార్థ సారథిగారు, రాజమహేంద్రవరం వాస్తవ్యులు. సుప్రసిద్ద వీణా విద్వాంసులు శ్రీ రామాచారి మరియు శ్రీమతి రామానుజమ్మ గారి మొదటి సంతానం( జనవరి, 13, 1917) ద్వారకా బాయి, కర్నూలు వాసి, అనన్య దేశభక్తులు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు మరియు రమాబాయిగార్ల మూడవ సంతానం. (డిసెంబర్, 17, 1920, చింతాద్రి పేట, మద్రాస్)

 

 వీరువురు ఉద్దండ మూర్తులైన శ్రీ రామాచారి, శ్రీమతి రామానుజమ్మగార్ల దగ్గరే గాక మైసూరుకు  నుంచి వచ్చి రాజమహేంద్రవరంలో సంగీత ఉపాధ్యాయులుగా ఉండిన  సంగీత శిక్షకులు బి.ఎస్.లక్ష్మణ్ రావుగారివద్ద కూడా సంగీతాభ్యాసం చేసేవారు. వీరిరువురికి  డా.శ్రీపాద పినాక పాణిగారు( ఆగస్టు3,1913-మార్చి 11, 2013) సహాధ్యాయి.

 

పార్థసారథి 1937 లొ మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి సంగీత పట్టభద్రులైనారు. వారు కొంతకాలం మదనపల్లె రిషి వాల్లి పాఠశాలలోనూ, మద్రాస్ త్యాగరాయ నగర, బాల భారత్, విద్యోదయ మహిళా ఉన్నత పాఠశాలలో  అధ్యాపకులుగానూ, 1960 నుండి 1975 వరకు, మద్రాస్ విశ్వవిద్యాలయములొ వీణా  ఉపన్యాసకులుగానూ సేవలందించారు.

 

 ఆకాశవాణి నిలయ విద్వాంసులుగా ఉంటూ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ లలో లెక్క లేనన్ని కచేరిలు జరిపారు.   

 

ద్వారకా బాయి  మొదట నంద్యాలలొ తల్లి రమాబాయి దగ్గిరే  సంగీతాభ్యాసం చేసారు. ఇక్కడ స్మరించవలసిన వ్యక్తి పేరిన్నికగన్న, వకీలు, నంద్యాల పురపాలక సంఘానికి మూడు పర్యాయాలు అధ్యక్షులు, దేశభక్తుడు, సంఘ సంస్కర్త,  ఆగర్భశ్రీమంతులు, మహాదాని, కాంగ్రెస్ నాయకుడు, "నంద్యాల గాంధీ" బిరుదాంకితుడు కాదరాబాద్ నరసింగారావు. గాంధీగారి మొదలు, గాడిచర్లగారివరకు, నంద్యాలలొ మహానాయకులందరికి, ఆతిధేయి. అయినా వారిపై ఎలాంటి నేరాలు మోపబడలేదు,  కారణం-  నంద్యాల వచ్చిన ప్రభుత్వాధికారులందరికి  ఆతిధ్యం కాదరాబాద్ వారి ఇంట్ళొనే.

 

గాడిచర్ల వారు నిరంతర సంచారి.  భార్య, బిడ్డను  నంద్యాలలోవదలి వెళ్లేవారు.  కాదరాబాద్ గారు రమాదేవిని తన కనురెప్పలలొ, సహోదరిగానూ, ద్వారకాబాయిని మేనకోడలిగానూ ఆలనా పాలనా చేసెవారు. ద్వారకా బాయి, సంగీతోభ్యాసముతొ పాటు నంద్యాల పురపాలకోన్నత పాఠశాలలో బడి చదువు పూర్తి చేసి, మద్రాస్ క్వీన్ మేరిస్ కళాశాలలొ ఇంటర్ మీడియట్ చదివి, సంగీతం డిప్లోమా అత్యున్నత స్థానములొ పాసయ్యారు. తండ్రితొ పాటు అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలకు వెళ్ళినవారు. వారు ఉన్నత స్థాయి "గోటువాద్య విద్వాంసరాలు"గా గుర్తింపు పొందారు. చెన్నైలోని, స్త్రీ సేవా సదన్, కేసరి ఉన్నత పాఠశాల, విద్యోదయ బాలికల ఉన్నత పాఠశాలలొ సేవలందిస్తూ, ఆంధ్ర ప్రదేశ్ మరియు తమిళనాడు ప్రభుత్వాల నిర్వహించిన పరీక్షలకు నిర్వాహకులుగా వ్యవహరించారు. స్త్రీ సేవా మందిరంలొ సంగీత శాఖ ప్రారంభించడములొ వారి పాత్రే కీలకం.

   

ఈ సంగీత దంపతులు స్థాపించిన ‘మద్రాస్ సంగీత కళాశాల’ వందలాది దేశీయ విద్యార్థులతొ పాటు. అమెరికా, ఇంగండ్. ఆస్ట్రేలియా, జర్మని, ఇటాలి, ఫ్రాన్స్, మలేసియా, శ్రీలంక తదితర విదేశాల సంగీత పిపాసులు కూడా ఆకర్శించింది. ఇక్కడ తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ ప్రభుత్వాలతో పాటు మద్రాస్ విశ్వవిద్యాలయ  డిప్లొమా పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం విశెేషం.

 

1972 జూన్ 2 న చెన్నైలొ  రసిక రంజని సభాభవనములొ, ఆ నాటి తమిళ్ నాడు గవర్నర్ కె.కె శాగారి అధ్యక్షతన జరుగిన కళాశాలా రజతోత్సవములొ గురు దంపతులను అప్పటి మరియు పూర్వపు విద్యార్థులు వెండి వీణను బహుకరించి ఘనంగా సన్మానించారు.

 

కళాశాలను సందర్శించి తమ మెప్పును వ్యక్తీకరించి, సందేశం పంపినవారిలొ,  రాష్ట్రపతి, డా.రాధాకృష్ణన్, ఉ.ప్ర.గవర్నర్ డా.బెజవాడ గోపాల్ రెడ్డి, మద్రాస్ ముఖ్యన్యాయాధిశులు డా.పి.వి.రాజమన్నార్, మద్రాస్ విశ్వవిద్యాలయం ఉప కులపతి, ఆచార్య సుందర వడివేలు, "సంగీత కళానిధి", "పద్మభూషణ్" ఆచార్య పి.సాంబమూర్తి మొదలగు మహోద్దండ మూర్తులు ఉన్నారు. 

 

ఆంధ్ర ప్రదేశ సంగీత నాటక అకాడెమి వారు విజయవాడాలొ "కళా ప్రవీణ", గోదావరి జిల్లాలవారు "గాన కళా ప్రపూర్ణ" మరియు కామకోటి పీఠాధిపతులు సద్గురు శంకరాచార్యవారు"సంగీత జ్యోతి" బిరుదులు, పురస్కారలతొ పార్థసారథివారిని సన్మానించారు.  ద్వారకా బాయిగారి ప్రామాణిక, నిస్వార్థ, చిత్తశుద్ది సెవలను గుర్తించి ప్రసిద్ధ తెలుగు పత్రిక ’గృహలక్ష్మి’ బంగారు గాజుతొ "గృహలక్ష్మి కంకణం" బిరుదును అందచేశారు. తరచుగా వారు, తెలుగు పత్రికలకు వారసత్వం, సంస్కృతి, విశిష్ట,ఆసక్తికరమైన ప్రదేశాలు, సంగీత మూలం వంటి అంశాల పై వ్యాసాలు రాసేవారు.

 

వారి కొన్ని అమూల్య గ్రంథాలు, "గానకళా బోధిని", "త్యాగరాజులవారి కృతులు", "ముత్తుస్వామి దీక్షితులవారి నవగ్రహ  కృతులు", "పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్", "శ్యామాశాస్త్రి", "రామనాథ్ శ్రీనివాస అయ్యంగార్", "రాగమల్లికాభరణి" "జావళీస్" వంటి రచనలను కేంద్ర సంగీత నాటక అకాడెమి,  ఆంధ్ర ప్రదేశ సంగీత నాటక అకాడెమి  ప్రోత్సాహించాయి..  

 

 సేవా తత్పరులైన వారు ఇంటివద్ద మిగిలిన పిత్రార్జిత భూమి అమ్మగా వచ్చిన ఆరు వేలకు రుణం జోడించి ’గోపాలపురం మొదటి వీధిలొ’ సొంత ఇల్లు కట్టుకున్నారు. ఈ భవనమే గాడిచర్లవారికి అవసాన దశలొ ఆశ్రయమిచ్చింది." (హరిసర్వోత్తమ జీవితం - మాదాల వీరభద్ర రావుగారు. మోదటి ముద్రణ: 1965, రండవ పరిష్కృత ముద్రణ; గాడిచర్ల ఫౌండేషన్: 2016 )

 

వారికి శ్రీరామ్, మోహన్ కృష్ణ, లక్ష్మణ్, సుధాకర్, నాలుగురు కుమారులు. ఐదవవాడు గీతార్థ మూడవ యేట చనిపోవడంతో వీరు పుత్రశోకాన్ని కూడా అనుభవించాల్సి వచ్చింది.            

 

ఎందరో విద్యార్థులను కళాకారులుగా తీర్చిదిద్దన ఈ దంపతులలో   పార్థసారథి, జనవరి, 12,1985న ద్వారకా ఎప్రిల్,14, 1978 న  స్వర్గస్తులైనారు.   వారి కుమారులు, కోడళ్ళు, మనుమళ్ళు, మనుమరాండ్రు  వారి శతమానోత్సవాన్ని”సంగీత కాశి" మద్రాస్ మ్యూసిక్ అకాడెమీలొ మార్చ్, 12,2017 న  వైభవముగా జరుపుతున్నారు.

 

ఆ సందర్బంగా గాడిచర్ల దంపతుల నిలువెత్తు తైల చిత్రాన్ని ఆవిష్కరించడానికి నన్ను ఆహ్వనించిన నల్లాన్ చక్రవర్తుల కుటుంబానికి వేయి దండాలు.

 

ఆ చిత్రాన్నిగాడిచర్ల ఫౌండేషన్ కు అప్పగించడానికి నిర్ణయించినందుకు  వారి సౌజన్యానికి, మాతృ, పితృ భక్తి భావాలకు, కుటుంబ గౌరవాలు కాపాడానికి వారు చేస్తున్న కృషికి అభినందనలు.

 

Every living thing share an ancestry- Charles Darwin.  

Follow Us:
Download App:
  • android
  • ios