హైదరాబాద్‌: ఇటలీ ప్రీమియం బైక్‌ల తయారీసంస్థ బెనెల్లీ భారత విపణిలోకి మరో కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. 500సీసీ విభాగంలో విడుదల చేసిన ఈ లియాంచినో మోడల్‌ ధర రూ.4.79 లక్షలుగా నిర్ణయించారు. ఇది ఎరుపు, స్టీల్‌ గ్రే రంగుల్లో లభించనుంది. ఐదేళ్లు అపరిమిత కిలోమీటర్ల వారంటీ ఉంటుంది. 

ఈ ఏడాది చివరికల్లా 300సీసీ కన్నా తక్కువ సామర్థ్యం గల విభాగంలోనూ బైకులను విపణిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు బెనెల్లీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ వికాస్‌ ఝబక్‌ చెప్పారు. కొన్ని నెలల్లో రెండు, మూడు కొత్త మోడళ్లు విడుదల చేస్తామన్నారు. 

ప్రస్తుతం తమ వద్ద ఆరు మోడళ్లు ఉన్నాయని, 2020 చివరికల్లా 12 మోడళ్ల వరకు తెచ్చేందుకు చూస్తున్నట్లు బెనెల్లీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ వికాస్‌ ఝబక్‌ చెప్పారు. జనవరి నుంచి ఇప్పటివరకు 1,000 బైకులు విక్రయించామని తెలిపారు. 

ఈ ఏడాది చివరికల్లా వీటి సంఖ్య 2,000లకు చేరుతుందని బెనెల్లీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ వికాస్‌ ఝబక్‌ పేర్కొన్నారు. విద్యుత్‌ స్కూటర్లను తీసుకొచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 19 మంది డీలర్లు ఉన్నారనీ, మరో 15 మందిని నియమించబోతున్నట్లు వెల్లడించారు.

దేశీయ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ బైకును హైదరాబాద్‌లో ఉన్న అసెంబ్లింగ్ యూనిట్‌లోనే తయారు చేసినట్లు బెనెల్లీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ వికాస్‌ ఝబక్‌ తెలిపారు.హైదరాబాద్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌లో ప్రస్తుతం ఏడాదికి 40,000 మోటార్‌ సైకిళ్లు బిగించగలమన్నారు.

అవసరమైతే రెండో ప్లాంటు ఏర్పాటు చేసే విషయాన్నీ ఆలోచిస్తున్నట్లు హైదరాబాద్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌లో ప్రస్తుతం ఏడాదికి 40,000 మోటార్‌ సైకిళ్లు బిగించగలమన్నారు. అవసరమైతే రెండో ప్లాంటు ఏర్పాటు చేసే విషయాన్నీ ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని గుండ్లపోచంపల్లి వద్ద రూ.40 కోట్లతో అసెంబ్లింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. . మూడేళ్ల క్రితం దేశీయ మార్కెట్లోకి అడుగు పెట్టిన సంస్థ..ఇప్పటి వరకు 6 వేల యూనిట్లకు పైగా విక్రయించింది. 

ఈ కొత్త బైక్‌లో ఇన్‌-లైన్‌2 సిలిండర్‌, డీవోహెచ్‌సీ లిక్విడ్‌ కూల్డ్‌, 8-వాల్స్‌, 500సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్‌ అమర్చారు. 50 ఎంఎం ఇన్వర్టెడ్‌ టెలిస్కోపిక్‌ ఫోర్క్‌, ఏబీఎస్‌, 145 ఎంఎం గ్రౌండ్‌ క్లియరింగ్‌ ఈ వాహనం ప్రత్యేకతలు

భారత ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యుత్ వాహనాన్ని కూడా మార్కెట్లోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు ప్రారంభమయ్యాయని బెనెల్లీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ వికాస్‌ ఝబక్‌ అన్నారు. దేశంలో ప్రీమియర్‌ బైక్‌ల వాడకం పట్ల యువతలో ఆసక్తి పెరగుతూ వస్తోందన్నారు.