నెల్లూరు: సీఎం ఇచ్చిన స్వేచ్ఛను జిల్లా ఎస్పీ దుర్వినియోగం చేశారని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. జిల్లా ఎస్పీకి తనకు మధ్య వ్యక్తిగత విబేధాలున్నాయని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.

ఆదివారం నాడు ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి స్పెషల్ జ్యూడిషియల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు. 

తనను పార్టీకి దూరం చేయడమే లక్ష్యంగా కొందరు కుట్రలు చేశారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు.తనపై కేసు పెట్టించిన పెద్ద తలకాయ ఎవరో జగన్ తెలుసుకోవాలని ఆయన కోరారు

ఎండిఓ సరళ కేసు పెట్టే సమయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కుడిభుజం పోలీస్ స్టేషన్ వద్ద హంగామా చేశారని ఆయన గుర్తు చేశారు. ఎండిఓ ఇంటికి వెళ్లి తనతో పాటు తన అనుచరులు బెదిరింపులకు పాల్పడలేదని  ఆయన చెప్పారు.

 జిల్లా ఎస్పీకి తనకు మధ్య విబేధాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో తనను, తమ పార్టీ కార్యకర్తలను ఎస్పీ ఇబ్బందులకు గురి చేశారని ఆయన చెప్పారు. సరళ కేసు విషయంలో  విచారణ జరిపి తన తప్పులుంటే చర్యలు తీసుకోవాలని  ఆయన డిమాండ్ చేశారు.

 కుట్ర పూరితంగానే తనపై ఈ కేసును బనాయించారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు చేశారు. పార్టీ కోసం మొదటి నుండి కష్టపడిన వారిని కేసుల్లో ఇరికిస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో వాస్తవాలు బయటకు తీయాల్సిన అవసరం ఉందని శ్రీధర్ రెడ్డి చెప్పారు.

హీరోల కంటే హై రేంజ్ లో దర్శకుల జీతాలు!

ఇవాళ ఉదయం పూట తనను అరెస్ట్ చేసే సమయంలో కూడ పోలీసులు అతిగా ప్రవర్తించారని కూడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు చేశారు. తాను లొంగిపోయేందుకు సిద్దంగా ఉన్నా కూడ పోలీసులు అతిగా ప్రవర్తించారని ఆయన అభిప్రాయపడ్డారు.


సంబంధిత వార్తలు

ఎండీఓకు బెదిరింపులు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్

సూత్రధారులు వేరే ఉన్నారు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి....