Asianet News TeluguAsianet News Telugu

మద్యం తాగి వచ్చి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి చేశారు: ఎంపిడీవో సరళ

తన ఇంటిపై వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి చేశారని నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఆరోపించారు. మద్యం తాగి వచ్చి తన ఇంట్లో విధ్వంసానికి పాల్పపడ్డారని ఆమె ఆరోపించారు.

YCP MLA Kotamreddy Sridhar Reddy attacks MPDO
Author
Nellore, First Published Oct 5, 2019, 8:27 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడివో సరళ ఇంటిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి చేశారు. శ్రీధర్ రెడ్డి మద్యం తాగి వచ్చి శుక్రవారం రాత్రి కల్లూరిపల్లి ఎఁఐడీ కాలనీలోని తన ఇంటిపై దాడి చేశారని ఎంపిడీవో సరళ ఆరోపించారు. దాంతో తానే స్వయంగా నెల్లూరు రూరల్ పోలీసులకు లిఖిత పూర్వకం్గా ఫిర్యాదు అందిస్తున్నట్లు తెలిపారు. 

తాను ఎంపీడివోగా పనిచేస్తున్న వెంకటాచలం మండలంలో వైసిపి నాయకుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి సమీప బంధువు కృష్ణా రెడ్డికి సంబంధించిన స్థలాల్లో లేఅవుట్ వేశారని, అందులో తాగునీటి పైపులైన్లతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించుకోవడానికి అనుమతులు ఇవ్వాలని శ్రీకాంత్ రెడ్డి ఈ నెల 1వ తేదీన తన ఫోన్లో నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో తనతో మాట్లాడించారని ఆమె వివరించారు. 

ఈ నెల 2వ తేదీ సాయంత్రానికి అనుమతులు ఇచ్చే పని పూర్తి కావాలని శ్రీధర్ రెడ్డి తనతో చెప్పారని సరళ మీడియాతో చెప్పారు. ఆ రోజు సచివాలయాల ప్రారంభాలు ఉన్నందున అనుమతులు మంజూరు చేయడం కుదరలేదని ఆమె చెప్పారు. దాంతో శుక్రవారం ఫోన్ చేసి శ్రీదర్ రెడ్డి తాను చెప్పిన పని ఎందుకు చేయలేదంటూ తిట్టిపోశారని ఆమె చెప్పారు. 

సాయంత్రం కల్లూరిపల్లిలోని తన నివాసానికి శ్రీధర్ రెడ్డి వచ్చారని, ఆ సమయంలో తాను ఇంట్లో లేనని, తన తల్లి మాత్రమే ఉందని, ఆమెను నానా దుర్భాషలాడి బీభత్సం సృష్టించారని సరళ ఆరోపించారు. ఇంట్లోకి వచ్చి విద్యుత్తు లైన్లను కట్ చేశారని, తాగునీటి పైపులైన్లను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్ వైర్లను కూడా ముక్కలు చేశారని చెప్పారు. 

పోలీసులకు ఆ విషయంపై సమాచారం ఇ్చాచని, వారు లిఖితవూర్వకంగా ఫిర్యాదు కోరడంతో అర్థరాత్రి తానే స్వయంగా నెల్లూరు పోలీసు స్టేషన్ కు వచ్చానని ఆమె చెప్పారు. అక్కడ ఫిర్యాదు తీసుకోవడానికి ఎస్సై గానీ, సిఐ గానీ లేరని, ఒక్క కానిస్టేబుల్ మాత్రమే ఉన్నాడని ఆమె చెప్పారు. 

సిఐ లేదా ఎస్సై వచ్చేదాకా అక్కడే ఉంటానని చెప్పి సరళ చెట్టు కింద కూర్చుననారు. మండలంలోని గ్రామ కార్యదర్శులంతా ఆమెకు సంఘీభావంగా అక్కడే ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios