Asianet News TeluguAsianet News Telugu

భార్య సమాధి వద్ద సెల్పీ వీడియో తీసుకుని భర్త ఆత్మహత్యాయత్నం.. గతంలో భార్య ఆత్మహత్యను వీడియో తీసి.. ఇప్పుడు ఇలా

పెంచలయ్య ఆత్మకూరులోని ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటాడు. భర్త వేధింపులు భరించలేక భార్య కొండమ్మ  నిరుడు సెప్టెంబర్ 21న ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో భార్య సమాధి వద్దకు వెళ్లిన పెంచలయ్య.. తన భార్య చావుకు,  తన చావుకు ఆరుగురు కారణమంటూ సూసైడ్ నోట్ రాయడం  గమనార్హం. ఇదే విషయాలను చెబుతూ  సెల్ఫీ వీడియో తీసి వాట్స్అప్ గ్రూపులో షేర్ చేశాడు. 

man attempt suicide near wife tomb in nellore district
Author
Hyderabad, First Published Jan 29, 2022, 7:19 AM IST

ఆత్మకూరు :  nellore district ఆత్మకూరు పట్టణానికి చెందిన Penchalaya అనే వ్యక్తి భార్య సమాధి వద్ద పురుగుల మందు తాగి suicide attemptకి పాల్పడ్డాడు. అయితే ఇదంతా Selfie video తీసుకుని whatsapp లో షేర్ చేయడంతో సంచలనంగా మారింది.  గతంలో అతడి భార్య suicide చేసుకుంటుంటే పెంచలయ్య వీడియో తీయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.  

పెంచలయ్య ఆత్మకూరులోని ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటాడు. భర్త వేధింపులు భరించలేక భార్య కొండమ్మ  నిరుడు సెప్టెంబర్ 21న ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో భార్య సమాధి వద్దకు వెళ్లిన పెంచలయ్య.. తన భార్య చావుకు,  తన చావుకు ఆరుగురు కారణమంటూ సూసైడ్ నోట్ రాయడం  గమనార్హం. ఇదే విషయాలను చెబుతూ  సెల్ఫీ వీడియో తీసి వాట్స్అప్ గ్రూపులో షేర్ చేశాడు. 

ఆ తర్వాత పురుగుల మందు తాగడంతో స్పృహతప్పి పడిపోయాడు. ఆ వీడియో చూసిన వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు ఎస్సై శివశంకర్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి  చేరుకున్నారు. బాధితుడిని వైద్యం నిమిత్తం జిల్లా వైద్యశాలకు తరలించారు. ప్రధమ చికిత్స తర్వాత మెరుగైన వైద్య సేవల కోసం  నెల్లూరుకు తరలించారు.  ప్రస్తుతం పెంచలయ్య ఆరోగ్య పరిస్థితి  విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా,  నిరుడు సెప్టెంబర్ 21న నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దారుణం జరిగింది. భర్త ఎదుటే ఉరివేసుకుని భార్య ఆత్మహత్య చేసుకుంది. భార్య ఉరి వేసుకుంటుంటే ఆపాల్సింది పోయి వీడియో తీశాడు ఆ భర్త. ఆ తరువాత ఈ వీడియో వైరల్ కావడంతో... విషయం తెలుసుకున్న పోలీసులు భర్త  పెంచలయ్యను అరెస్టు  చేశారు. బెదిరిస్తోంది అనుకున్నాడో లేక నిజంగానే ఆత్మహత్య చేసుకోవాలని ఉరివేసుకున్నదో తెలియదు కానీ కళ్లెదుటే భార్య ప్రాణాలు తీసుకుంటున్నా పట్టించుకోలేదు. 

పైగా ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడు పెంచలయ్య. ఆమె ఉరి వేసుకుంటున్న దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  పెంచలయ్యను అరెస్టు చేశారు. మృతురాలిని ఆత్మకూరు మెప్మా లో రిసోర్స్ పర్సన్ గా పనిచేస్తున్న కొండమ్మగా గుర్తించారు. అటు పెంచలయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మెప్మా సిబ్బంది ఆందోళనకు దిగారు. 

ఇలాంటి ఘటనే గతంలోనూ జరిగింది. హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో అరుణ (31) అనే గృహిణి అనుమానాస్పద స్థితిలో మరణించింది. తమ కూతురిని హత్య చేసి ఉంటారని ఆమె తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. తనతో గొడవ పడిన భార్య ఉరేసుకుంటానని గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుందని, బెదిరించడానికే అలా చేస్తోందని కిటికీలో నుంచి తాను మొబైల్ తో వీడియో తీశానని, ఫొటోలు కూడా తీశానని మహిళ భర్త  శ్రీనివాస్‌ పోలీసులతో చెప్పినట్లు సమాచారం. 

ఆ తరువాత తాను వెళ్లి నిద్రపోయానని, ఉదయాన్నే చూశానని అతను పోలీసులకు చెప్పాడని అంటున్నారు. ఆ స్థితిలో భార్యను రక్షించేందుకు ప్రయత్నించకుండా అలా చేశానని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. అరుణ ముఖంపై గాయాలు, రక్తం కారిన గుర్తులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. భార్య ఉరేసుకున్న విషయాన్ని గుర్తించిన శ్రీనివాస్‌ కర్రతో గడియ తీసి, లోనికి వెళ్లి ఆమెను దింపినప్పుడు బరువుకు కిందపడటంతో ముఖంపై గాయాలై ఉంటాయంటుని పోలీసులు అంటున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios