నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలంటూ జనం కదం తొక్కారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కళాశాలలు, పాఠశాల విద్యార్ధులు, స్థానికులు, ఉద్యోగులు, మేథావులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం జనవిజ్ఞాన వేదిక నాయకులు మాట్లాడుతూ.. రాజుల కాలంలో పాలనా కేంద్రంగా వెలుగొందిన ఉదయగిరి నేడు కరువుతో అల్లాడిపోతందని, ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగు, సాగు నీరు కరువై ప్రజలు, రైతులు కరువు రక్కసి కోరల్లో చిక్కుకుపోయారన్నారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.