నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి కామంతో కళ్లు మూసుకుపోయి అత్యంత నీచమైన కార్యానికి ఒడిగట్టాడు. 11 ఏళ్ల బాలికపై 35 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలం బసవరాజు పాలెం గ్రామంలో చోటు చేసుకుంది. 

బాలిక మేకలను మేపుతుండగా అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఆమె చెంతకు చేరాడు. తన సెల్ ఫోన్ లో ఆమెకు బూతు బొమ్మలు చూపించాడు. ఆ తర్వాత అత్యాచారం చేశాడు. బాధితురాలు నిందితుడికి వరసకు కూతురు అవుతుంది. 

జరిగిన విషయాన్ని బాలిక తన ఇంట్లో చెప్పింది. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకని అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. 

చట్టాలు ఎన్ని వచ్చినా, కఠినమైన శిక్షలు పడుతున్నా కామాంధులు తమ బుద్ధిని మానకోవడం లేదు. బాలికలపై అత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి.