ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం గన్నవరం నుంచి బయల్దేరి నేరుగా రేణిగుంటకు చేరుకుంటారు.  అక్కడ్నుంచి 11 గంటలకు కాకుటూరులోని సభా ప్రాంగాణానికి చేరుకోని స్టాల్స్ పరిశీలిస్తారు. 11.30 గంటలకు వేదికపై నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి అమరావతికి చేరుకుంటారు.

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్నారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు జిల్లా నేతలు, అధికారులు సిద్ధమవుతున్నారు. 
వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రారంబించనున్నారు. ఆ పథకం లబ్ధిదారులు, వలంటీర్లు సభకు తరలివచ్చేలా చూడాలని అధికారులకు కలెక్టర్‌ శేషగిరిబాబు  సూచించారు. సభావేదిక వద్ద ఏర్పాట్లను అధికార సిబ్బంది పూర్తి చేశారు.

అయితే ఇప్పుడు నెల్లూరు రాజకీయం హట్ టాఫిక్ మారింది. అధికార ప్రతిపక్షాల బలాబలాలకు నెల్లూరు జిల్లా వేదిక అవుతుంది. మాజీ సీఎం చంద్రబాబు జిల్లా స్థాయి సమీక్షల కోసం నెల్లూరు జిల్లాలోనే ఉన్నారు. మంగళవారం  సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం నెల్లూరులో పర్యటిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు ఇద్దరు జిల్లాకు వస్తున్న నేపధ్యంలో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.  ఇద్దరు నాయకులకు జిల్లా పర్యటనలు ఉన్న సందర్భంగా అధికార , ప్రతిపక్ష పార్టీల నాయకులు బలాబలాలు చూపించుకోటానికి సిద్దమవుతున్నారు.