కర్ణాటకలో ముఖ్యమంత్రి యడియూరప్ప 17 మందితో తన మంత్రివర్గాన్ని విస్తరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం వెనుక కీలకపాత్ర పోషించిన... కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలకు చోటు దక్కకపోవడం రాష్ట్రంలో పెద్ద చర్చకు దారి తీసింది
కర్ణాటకలో ముఖ్యమంత్రి యడియూరప్ప 17 మందితో తన మంత్రివర్గాన్ని విస్తరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం వెనుక కీలకపాత్ర పోషించిన... కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలకు చోటు దక్కకపోవడం రాష్ట్రంలో పెద్ద చర్చకు దారి తీసింది.
మొత్తం 14 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. అందుకే యడ్డీ వీరిని తాత్కాలికంగా పక్కనబెట్టినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే వీరి కోసం 16 బెర్తులు ఖాళీగా వుంచినట్లు బెంగళూరులో ప్రచారం జరుగుతోంది. సుప్రీంలో తీర్పు కనుక వీరికి అనుకూలంగా వచ్చినట్లయ్యింది.. కనీసం 12 లేదా 14 మందికి మంత్రిపదవులు దక్కవచ్చునని తెలుస్తోంది.
ఒకవేళ సుప్రీం వీరి పిటిషన్‌ను కొట్టివేసినప్పటికీ.. ఉప ఎన్నికలు వచ్చి మళ్లీ వారు గెలిచేంతవరకు కొన్ని మంత్రి పదవులను అలాగే వుంచే అవకాశం ఉంది. అయితే మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కకపోవడంతో పలువురు బీజేపీ సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు.
దీంతో వీరిని బుజ్జగించేందుకు అతి త్వరతో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కాగా... మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన వారిలో దాదాపు సగం మంది యడియూరప్ప వర్గీయులే కావడం గమనార్హం.
వీరంతా ఆయన గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారే. ఇక లింగాయత్ వర్గానికి ఊహించినట్లుగానే ఏడు మంత్రి పదవులు లభించాయి. స్వయంగా సీఎం కూడా అదే వర్గానికి చెందిన వారు కావడం తెలిసిందే.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 21, 2019, 11:32 AM IST