తన మాజీ భార్య పట్ల...మాజీ భర్త దారుణంగా వ్యవహిరించాడు.. స్నేహితులతో కలిసి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడటంతో పాటు హింసించడంతో ఆమె మరణానికి కారణమయ్యాడు. వివరాల్లోకి వెళితే...జార్ఖండ్‌ జంతర్ జిల్లా నారాయణ పూరా‌లో బుధవారం రాత్రి ఓ మహిళా స్థానిక థియేటర్‌లో సినిమా చూడటానికి వెళ్లింది.

దీనిని గమనించిన ఆమె మాజీ  భర్త కుట్ర పన్నాడు.. సినిమా ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా.. మార్గమాధ్యంలో మరో ఇద్దరు మిత్రులతో కలిసి ఆమెను అడ్డగించాడు. అనంతరం మాజీ భార్యను పొలాల్లోకి లాక్కెళ్లి... ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అక్కడితో ఆగకుండా ఆమె పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారు.. మాజీ భార్య అన్న కనికరం లేకుండా ఆమె ప్రైవేట్ భాగాల్లోకి కర్రను చొప్పించి.. చిత్రహింసలకు గురిచేసి అక్కడి నుంచి పారిపోయారు.

గురువారం ఉదయం నగ్నంగా, గాయాలతో ఉన్న ఆమెను గమనించిన స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చిత్రహింసల కారణంగా ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

తన మాజీ భర్తే ఈ దారుణానికి పాల్పడినట్లుగా బాధితురాలు కొనఊపిరితో ఉండగా చెప్పిందని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. దీంతో మృతురాలి మాజీ భర్త సహా మిగిలిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు..