ఢిల్లీ విమానాశ్రయంలో ఓ మహిళ 500 గ్రాముల హెరాయిన్ తరలిస్తూ పట్టుబడింది. ఆమె ఈ హెరాయిన్ ను 51 గుళికల రూపంలో మింగి.. తరలిస్తుండగా.. అనుమానం వచ్చిన అధికారులు తనిఖీ చేశారు.
ఢిల్లీ : Delhi's IGI airportలో భారీ స్థాయిలో heroin పట్టుబడింది. ఓ మహిళ 501 గ్రాములు బరువైన 51 క్యాప్సూల్స్‌ను మింగింది. వీటిని అక్రమంగా తరలించడానికి ప్రయత్నించినందుకుగానూ IGI airportలో ఆ మహిళను అరెస్టు చేసినట్లు కస్టమ్స్ అధికారులు గురువారం తెలిపారు.అనుమానం రావడంతో.. ఫిబ్రవరి 9 న ఉగాండా నుండి దుబాయ్, దోహా నుండి ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ 3 వద్దకు వచ్చిన ప్రయాణికురాలిని గ్రీన్ ఛానల్ వద్ద అడ్డగించినట్లు కస్టమ్స్ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆమె తన వెంట ఒక బ్యాగ్‌ప్యాక్, ఒక హ్యాండ్ బ్యాగ్‌ని తీసుకువచ్చింది. అయితే ఎక్స్-రే సమయంలో, ఆమె బ్యాగ్‌లలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు.. కానీ, అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆమె తన శరీరంలో కొన్ని క్యాప్సూల్స్ ఉన్నట్లు అంగీకరించింది. దీంతో ఆమెను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. ఆమెను ఆర్‌ఎంఎల్ ఆసుపత్రిలో చేర్చి.. ఆపరేషన్ తరువాత 51 క్యాప్సూల్స్‌ను ఆమె పొట్టలో నుంచి తీశారని ఒక ప్రకటనలో తెలిపారు. క్యాప్సూల్స్‌లో 501 గ్రాముల ఆఫ్-వైట్ కలర్ పదార్థం ఉంది, దీన్ని హెరాయిన్‌గా గుర్తించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.3.5 కోట్లు ఉంటుందని అంచనా. అంతేకాదు ఎన్‌డిపిఎస్ చట్టంలోని సెక్షన్‌ల కింద ఆమెను అరెస్టు చేసి, ఆమెనుంచి మిగతా మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల కస్టమ్స్ క్లియరెన్స్ కోసం, రెండంచెల ఛానల్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. పన్ను లేని వస్తువులు తీసుకొచ్చినప్రయాణీకుల కోసం గ్రీన్ ఛానల్, డ్యూటీ పడే వస్తువులతో ఉన్న ప్రయాణికులకు రెడ్ ఛానెల్.
కాగా, ఫిబ్రవరి 13న ముంబై ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు జింబాబ్వే లోని హరారే నుండి ఢిల్లీ చేరుకున్న మహిళ దాదాపు కోట్ల రూ .60 కోట్ల విలువ చేసే 8,586 గ్రాముల హెరాయిన్‌ను తీసుకువెళుతున్నట్లు గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా హెరాయిన్ ను ట్రాలీ బ్యాగ్ తో పాటు ఫైల్ ఫోల్డర్ లో దాచి తరలించే యత్నం చేసింది జింబాబ్వే మహిళ. అయితే ఆమె ప్రవర్తన కాస్త తేడా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు.
ఫిబ్రవరి 12న రువాండ్ఎయిర్ ఫ్లైట్ WB-500 ద్వారా హరారే నుండి ముంబైకి వచ్చింది. ఆమెను కస్టమ్స్ అధికారులు పలు సార్లు ప్రశ్నించినా.. ఏం చెప్పలేదు. దీంతో కస్టమ్ అధికారులు తమదైన విచారించడంతో అసలు విషయాన్ని వెల్లడించింది. తనిఖీ చేసేటప్పడు స్కానింగ్ కు చిక్కకుండా హెరాయిన్ ప్లాస్టిక్ కవర్స్ లో ప్యాకింగ్ చేసి, ట్రాలీ బ్యాగ్ ఫైల్ ఫోల్డర్ లో దాచినట్లు కస్టమ్ అధికారులు తెలిపారు. 8.486 గ్రాముల బరువున్న నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్ధాలు (ఎన్‌డిపిఎస్) ను ట్రాలీ బ్యాగ్‌లో, ఎగ్జిక్యూటివ్ బ్యాగ్‌లో పెట్టి.. రెండు ఫైల్ ఫోల్డర్‌లలో చాకచక్యంగా దాచి తీసుకవచ్చినట్టు అధికారులు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ. 60 కోట్లు ఉంటుందని , ప్రయాణికురాలి పై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
