Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఆస్పత్రి నుంచి మాయం.. 15 రోజుల తరువాత కుళ్లిన శవంగా దొరికిన మహిళ.. ట్విస్ట్ ఏంటంటే..


తమిళనాడులో ఓ దారుణ విషాద ఘటన చోటుచేసుకుంది. కరోనాతో ఆస్పత్రిలో చేరిన మహిళ అదృశ్యమై.. 15 రోజుల తరువాత శవంగా తేలింది. ఈ షాకింగ్ ఘటన చెన్నైలోని ఓ జనరల్ హాస్పిటల్ లో జరిగింది. 

woman professor disappears from hospital, found dead at the same place in TamilNadu - bsb
Author
Hyderabad, First Published Jun 10, 2021, 2:15 PM IST

తమిళనాడులో ఓ దారుణ విషాద ఘటన చోటుచేసుకుంది. కరోనాతో ఆస్పత్రిలో చేరిన మహిళ అదృశ్యమై.. 15 రోజుల తరువాత శవంగా తేలింది. ఈ షాకింగ్ ఘటన చెన్నైలోని ఓ జనరల్ హాస్పిటల్ లో జరిగింది. 

కరోనాతో బాధపడుతూ చెన్నై రాజీవ్ గాంధీ జనరల్ హాస్పిటల్ లో చేరిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హాస్పిటల్ లో చేరిన మరుసటి రోజు ఆమె అదృశ్యం కాగా 15 రోజుల తర్వాత కుళ్లిన స్థితిలో ఆమె మృతదేహం లభించింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

స్థానిక మాంబళం  ప్రాంతానికి చెందిన మౌళి హైదరాబాద్లోని ఓ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.ఆయన సతీమణి సుధ (41) కరోనా చికిత్స నిమిత్తం మే 22వ తేదీన చెన్నై జనరల్ ఆస్పత్రిలో చేరారు.  ఆస్పత్రి మూడో టవర్ మూడో అంతస్తులోని కరుణ వార్డులో ఆమెకు వైద్యులు చికిత్స అందించారు. మరుసటి రోజు ఉదయం మౌళి భార్యను చూడడానికి వెళ్ళినప్పుడు వార్డులో ఆమె కనిపించలేదు.

ఆస్పత్రి అధికారులకు తెలిపి అన్ని విభాగాల్లోనూ వెదికారు. ఫలితం లేకపోవడంతో ఆ  hours ఆస్పత్రి ఆసుపత్రి ప్రాంగణంలోని పోలీస్ స్టేషన్లు స్టేషన్లో ఫిర్యాదు  చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, సుధ ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆస్పత్రి 8 వ అంతస్తులో సుధ మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది.

 సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆమె మృతి చెందిందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios