గ్రేటర్ నోయిడాలోని దన్‌కౌర్ ప్రాంతంలో, ఓ మహిళ తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న తన భర్తను హత్య చేసేందుకు తన ప్రేమికుడితో కలిసి కుట్ర పన్నింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.

నోయిడా : ఓ మహిళ తన భర్తను murder చేసేందుకు ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఈ కేసులో మహిళ సహా ముగ్గురిని పోలీసులు arrest చేశారు. దీనికోసం నిందితులు liquor మత్తులో ఉన్న వ్యక్తిని ఇటుకతో మోది హత్య చేశారు. ఈ ఘటన Greater Noidaలోని దంకౌర్ ప్రాంతంలోని డియోటా గ్రామంలో జరిగింది. 

ఓ మహిళ తన ప్రేమికుడితో కలిసి తన భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నింది. ఈ కేసుకు సంబంధించి మహిళ, ఆమె ప్రేమికుడితో సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మే 19న ఆ ప్రాంతంలోని పశువైద్యశాల సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విచారణలో మృతుడిని సతీష్‌గా గుర్తించారు.

వివరణాత్మక దర్యాప్తు తర్వాత, నిందితులలో ఒకరైన రామ్‌కిషోర్‌ను పోలీసులు జీరో-ఇన్ చేశారు. అతనికి మృతుడి భార్య పూజకు వివాహేతరసంబంధం ఉంది. దీంతో తమ సంబంధానికి భర్త అయిన సతీష్ అడ్డుగా ఉన్నాడని భావించి.. హత్య చేసేందుకు పథకం పన్నారు. ఈ మేరకు కుట్ర పన్ని, సతీష్ ను హత్య చేశారు. పక్కా ప్లాన్‌ వేసి, రామ్‌కిషోర్‌ తన స్నేహితుడు మంజీత్‌తో కలిసి సతీష్‌ ను హత్య చేసినట్లు అంగీకరించాడు.

ఇద్దరు నిందితులు సతీష్‌ను ఓ చోటికి పిలిపించి అతడికి మద్యం తాగించారు. ఆ తరువాత మత్తులోకి జారుకున్నాక ఇటుకతో తల మీద పదే పదే కొట్టి చితకబాదారు. అనంతరం సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు మృతదేహాన్ని పొదల్లో దాచిపెట్టి, పరారయ్యారు. 

కాగా, రాజస్థాన్ లో మే 24న వెలుగులోకి వచ్చిన ఇలాంటి ఘటనలో ఇద్దరు చనిపోయారు. extramarital affair కాపురాల్లో చిచ్చు పెట్టడమే కాదు. ఎంతోమంది ప్రాణాలను కూడా బలికొంటున్నాయి. పచ్చని కాపురాలు కూల్చడమే కాదు.. భార్యనో.. భర్తనో నేరస్తులుగా మారుతున్నారు. ఈ క్రమంలో పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి. ఇలాంటి ఘటనే Rajasthanలో జరిగింది. 

తాజాగా రాజస్థాన్ లో వివాహేతర సంబంధం కారణంగా ఇద్దరు చనిపోయారు. ఇందులో ఒకరు హత్యకు గురవ్వగా, మరొకరు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఎలాగంటే... తన ప్రియుడిని భర్తే చంపించాడని తెలియడంతో ఓ మహిళ రైలు కిందపడి మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. రాజస్థాన్ లోని బికనీర్ కు చెందిన ఓ 40 యేళ్ల మహిళ తన భర్త మేనల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయం భర్తకు తెలిసింది. దీంతో అతను కోపంతో ఆమెను హెచ్చరించాడు. అయినా ఆమె భర్త మాట వినలేదు. తన ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. 

తాను హెచ్చరించానా వినలేదని తీవ్ర ఆగ్రహం పెంచుకున్న భర్త తన మేనల్లుడిని ఆదివారం చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారమే నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రియుడు చనిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన మహిళ సోమవారం మధ్యాహ్నం రైలు కిందపడి చనిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కు తరలించారు.