బెంగళూరులో ఓ నయా మోసం వెలుగులోకి వచ్చింది. వీడియోకాల్ లో నగ్నంగా ప్రేరేపించి వీడియోతీసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఓ కిలాడీ లేడి నయా మోసానికి పాల్పడింది. కర్ణాటకలోని బెంగళూరులో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 

ఓ అమ్మాయి ఓ యువకుడిని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నంటూ పరిచయం చేసుకుంది. అతనికి వీడియోకాల్ చేసి నగ్నంగా వీడియో తీసి దాన్ని బహిర్గతం చేస్తానని బెదిరించింది. డబ్బులు ఇవ్వకపోతే వీడియో బయట పెడతానంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసింది. 

బెంగళూరుకు చెందిన అంబీట్ కుమార్ మిశ్రా అనే యువకుడు ఓ మ్యాట్రిమోనియల్ సైట్‌లో తన పేరును రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దాన్ని చూసిన యువతి తాను సాఫ్ట్‌వేర్ ఇంజినీరునంటూ వల వేసింది. పెళ్లి చేసుకుందాం అంటూ ప్రతిపాదన చేసింది. 

 అంబీట్ కుమార్ మిశ్రాతో యువతి వీడియో కాల్ లో మాట్లాడుతూ తన దుస్తులను తొలగించింది. యువకుడిని కూడా బట్టలు విప్పేయాల్సింది కోరింది. దీంతో  అంబీట్ కుమార్ మిశ్రా కూడా దుస్తులు విప్పి యువతితో వీడియో కాల్ లో మాట్లాడాడు. 

ఈ వీడియోను యువతి రికార్డ్ చేసింది. ఆ తరువాత ఆ వీడియో బయట పెడతానని బెదిరించింది. అంబీట్ కుమార్ నుంచి 20వేల రూపాయలు గుంజింది. ఆ తరువాత మళ్లీ లక్ష రూపాయలు ఇవ్వాలంటూ కిలాడీ లేడి బ్లాక్ మెయిల్ చేయడంతో అంబిట్ మిశ్రా బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 అంబీట్ కుమార్ మిశ్రా యువతిని వ్యక్తిగతంగా కలవలేదని, వీడియోకాల్ లోనే మాట్లాడి ఇలా ఛీటింగ్ చేసిందని బాధితుడు ఫిర్యాదులో  పేర్కొన్నాడు. దీంతో యువకుడిని మోసగించిన కిలాడీ లేడీపై మోసం, దోపిడీ కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నయా రకం మోసంపై దర్యాప్తు ప్రారంభించారు.