పథకం ప్రకారం.. తన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి మాజీ ప్రేయసి ని హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అడవిలో పాతిపెట్టారు.

ప్రేమించిన వాడే ఆమె పాలిట కాల యముడుగా మారాడు. ఆమెను అతి కిరాతకంగా చంపేసి.. శవాన్ని అడవిలో పాతేశాడు. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఢిల్లీకి చెందిన అనుజ్ కుమార్(22) అనే వ్యక్తి ఓ మహిళ(30) ను ప్రేమించాడు. ఆమెతో కలిసి సహజీవనం కూడా చేశాడు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అయితే.. లాక్ డౌన్ లో సదరు మహిళ తన స్వగ్రామానికి వెళ్లింది. ఆ సమయంలో.. అనుజ్ కుమార్ మరో యువతి ప్రేమలో పడిపోయాడు. కొత్త గర్ల్ ఫ్రెండ్ తో కలిసి లివ్ ఇన్ రిలేషన్ లో ఉండటం మొదలుపెట్టాడు. అయితే.. అనుకోకుండా.. అతని మాజీ ప్రేయసి తిరిగి నగరానికి వచ్చేసింది. దీంతో.. మాజీ ప్రేయసిని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు.

పథకం ప్రకారం.. తన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి మాజీ ప్రేయసి ని హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అడవిలో పాతిపెట్టారు. ఆ తర్వాత.. సదరు మహిళ కనిపించడం లేదని.. ఆమెను ఎవరో హత్య చేశారంటూ పోలీసులకు తప్పుడు సమాచారం అందించారు. విచారణలో వీరే నేరం చేసినట్లు తేలడంతో.. నిందితులు పోలీసులకు చిక్కారు.

ఈ ఘనటలో ప్రధాన నిందితుడు అనుజ్ కుమార్ కాగా.. అతనికి సహకరించిన రంజాన్ ఖాన్(32), నౌషద్(21) లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు విచారణలో నేరాన్ని అంగీకరించారని పోలీసులు చెప్పారు.