Asianet News TeluguAsianet News Telugu

బైక్ షోరూంలో ఘోర అగ్నిప్ర‌మాదం... ఒక‌రి మృతి.. 300 బైకులు ద‌గ్ధం

జార్ఖండ్ పాలము జిల్లాలోని ఓ బైక్ షోరూంలో ఘోర అగ్ని ప్రమాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఓ వృద్ధురాలు (80) ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 300 ద్విచక్ర వాహనాలు తగలబడ్డాయి. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగిన‌ట్టు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. 

Woman Killed, 300 Two-Wheelers Destroyed In Jharkhand Showroom Fire
Author
First Published Sep 9, 2022, 5:17 PM IST

జార్ఖండ్‌లో ఘోర‌ ప్రమాదం జరిగింది. పాలము జిల్లాలో ఓ బైక్ షోరూంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్ర‌మాదంలో షోరూం యజమాని తల్లి మృతి చెందగా.. కాగా షోరూమ్ పూర్తిగా దగ్ధమైంది. దాదాపు 300 ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. మెదినీనగర్ పట్టణంలో గత అర్ధ రాత్రి ఈ విషాదకర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో షోరూం చుట్టుపక్కల ప్రజల్లో భయాందోళన నెలకొంది. అగ్నిప్రమాదంతో షోరూం యజమానికి కోట్లాది ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది 10 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 
 
పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. గురువారం రాత్రి 10 గంటల సమయంలో షోరూంలో మంటలు చెలరేగాయి. మంటలు దావాలంలా వ్యాపించ‌డంతో ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌నలు నెల‌కొన్నాయి. ఏం జ‌రుగుతుందో తెలియ‌రాక‌.. స్థానికుల్లో గందరగోళ ప‌రిస్థితి నెలకొంది. ఈ క్ర‌మంలో కొంత‌మంది స్థానికులు స్వయంగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మంటలు వ్యాప్తి పెరగ‌డంతో మూడు జిల్లాల నుంచి అగ్నిమాపక దళం వాహనాలను రప్పించి మంటలను అదుపు చేయాల్సి వచ్చింది. గుమ్లా, లతేహర్,  గర్వా జిల్లాల అగ్నిమాపక  సిబ్బంది 10 గంటల పాటు శ్ర‌మించ‌డంతో మంటలను అదుపులోకి వ‌చ్చాయి. మంటలలో మూడంతస్తుల భవనం మొత్తం దగ్ధమయ్యాయి. షోరూం యజమానికి కోట్లలో నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.

గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు 

షోరూమ్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. ముందుగా షోరూమ్ యజమాని సతీష్ సాహు తల్లి శారదా దేవి అగ్నికి ఆహుతైంది. కుటుంబ సభ్యులంతా పైకప్పు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే మంటల కారణంగా శారదా దేవి పైకప్పు ఎక్కలేకపోయింది. ఆమె గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉండిపోయింది. మంటలను పొగ రావడంతో ఊపిరి పీల్చుకోలేక‌..తీవ్ర ఇబ్బంది. ఎలాగోలా ఇరుగుపొరుగు వారి సహాయంతో శారదాదేవిని డాబాపైకి తీసుకొచ్చారు కానీ అప్పటికి చాలా ఆలస్యం అయింది. ఆమె అప్ప‌టికే అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమె వెంటనే  ఆసుపత్రికి తరలించిన ఫ‌లితం లేకుండా పోయింది. అప్పటికే  మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో శారదా దేవి భర్త కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆయ‌న‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. షోరూంలో మంటలు చెలరేగి శారదాదేవి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయ‌ని ప్రాథమిక విచార‌ణ‌లో గుర్తించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios