తొలుత అన్నచెల్లెలు.. కట్ చేస్తే .. అలుమగలు.. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న జంట 

ఓ జంట మూడు మూళ్ల బంధంతో ఒక్కటైంది. అయితే.. పెళ్లికి ముందు వారి వరుస తెలుసుకున్న నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టానూసారంగా కామెంట్స్ చేస్తూ.. ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే.. ఆ సోర్టీ చదవాల్సిందే.. 
 

Woman gets married to man she called bhaiyya for 8 yrs. Their story is viral krj

మన దేశంలో బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధ్యానత ఇస్తారు. మన కంటే వయస్సులో పెద్దవారికి విలువ ఇస్తారు. మరీ ముఖ్యంగా హిందూ మతంలో.. వయస్సులో మన కంటే పెద్దవారిని చాలా గౌరవిస్తాం.. మగవారిని "అన్నయ్య",అదే అమ్మాయిలయితే.. "అక్క" అని సంబోధిస్తాం. వారి పట్ల గౌరవ భావంతో ఉంటాం.  అయితే.. మిమ్మల్ని అన్నయ్య అని పిలిచే అమ్మాయి గానీ, మీకు రాఖీ కట్టిన అమ్మాయి గానీ వివాహం చేసుకోలేరు కాదా..  అలా ఆలోచించడం కూడా సరికాదని భావిస్తారు. అలా చేస్తే.. మన చూట్టు ఉన్నవారే వావివరుసలు మరిచిపోయారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ జంట అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది.  

ఓ యువతి ..చిన్నప్పటి నుంచి అన్నయ్య  అని పిలిచిన ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. మూడు మూళ్ల బంధంతో ఒక్కటై ఆ జంటకు ఓ కొడుకు కూడా.. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. వారి విచిత్ర లవ్ స్టోరీ గురించి వారే స్వయంగా బయట పెట్టే సరికి ..ఆ జంట వైరల్‌గా మారింది. ఆ జంటను చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు. తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ.. ట్రోలింగ్ చేస్తున్నారు.

వివరాల్లోకెళ్తే..  విని, జై భార్యాభర్తలు . వారికి ఉమ్మడి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉంది. వీరిద్దరూ తరుచు ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ పోస్టు చేస్తూ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.  వారు తన జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకుంటూ..  వీడియోలు, ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తుంటారు. అలాగే.. గత కొన్ని రోజుల క్రితం ఓ షాకింగ్ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియో చూసిన వారందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఈ వీడియోలో ఏ అంశాలను పంచుకున్నారని  ఆలోచిస్తున్నారు. 

 ఆ వీడియోలో విని తన ప్రేమ, పెళ్లి గురి వివరిస్తూ.. తన భర్త జై ని.. చిన్ననాటి నుండే భయ్యా (అన్నయ్య) అని పిలిచే దానినని ఆమెనే స్వయంగా చెప్పింది. చిన్నప్పుడూ స్నేహితులుగా ఉన్నా.. పెద్దయ్యాక ఆ స్నేహం కొనసాగించలేకపోవడం. పైగా జై... విని  కి   దూరపు బంధువు కావడంతో అతడిని భయ్యా అని పిలిచే దాన్ని అని పేర్కొంది. తొలుత వారి మధ్య సోదరభావం ఉన్నా.. క్రమేణా స్నేహంగా.. ఆ స్నేహం ప్రేమగా మారిందని పేర్కొంది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నట్టు.. ప్రస్తుతం వారి ఓ బిడ్డ పుట్టినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో తమ చాలా ఫొటోలు పెట్టారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vini & Jai (@viniandjai)

అయితే..  ప్రస్తుతం ఈ అందమైన జోడి ట్రోల్ కు గురవుతోంది. చాలా మంది నెట్టిజన్లు అసభ్యకరమైన కామెంట్ చేస్తూ.. ట్రోల్  చేస్తున్నారు. మరికొందరూ మాత్రం జోడి చాలా చూడముచ్చటగా ఉందని, నైస్ కపుల్స్ , కొన్నిసార్లు వివాహాలు దూరపు బంధువులతోనే జరుగుతాయని మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు. వీరి ఇన్‌స్టాగ్రామ్ రీల్ ను ఇప్పటివరకూ  49 లక్షలకు పైగా చూశారు. చాలా మంది వ్యక్తులు తమ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం ద్వారా తెలియజేస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios